నవతెలంగాణ – మాక్లూర్
మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకరన్ని మాక్లూర్, కల్లేడి,గొట్టుముక్కల, చిక్లీ నాలుగు సంఘాలుగా విభజించాలని కోరుతూ సొసైటీ చైర్మన్ బురోల్ల అశోక్ ఆధ్వర్యంలో పాలక వర్గం సభ్యులు బుధవారం ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ బురోల్ల అశోక్ మాట్లాడుతూ మాక్లూర్ సహకార సంఘం 26 గ్రామాలతో అతి పెద్ద సంఘం ఉందని దీనిని విభజిస్తే రైతులకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ అంశం పై వినయ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఇందులో సొసైటీ వైస్ చైర్మన్ గుండారం శేఖర్, డైరెక్టర్లు పాల్గొన్నారు.