గట్టుకడిపల్లిని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని వినతి..

Petition to establish Gattukadipalli as Gram Panchayat.నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని గట్టుకడిపల నూ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీ చెయ్యాలని గ్రామం పేరు మార్చాలని శుక్రవారం గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయంలో  సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు వినతి పత్రం ద్వారా పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. గట్టుకాడిపల్లి గ్రామ ప్రజలము, మా గ్రామము ఏర్పడి 100 సం„రాలు అయినప్పటికీ. ఈరోజు వరకు ఉప్పునుంతల గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతుందని. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ఉప్పునుంతల పోవలసి వస్తుందని మా గ్రామంలో అన్ని కులస్థుల ప్రజలు ఉన్నారు. మా గ్రామ జనాభా 340 కి పైగా ఓటర్లు ఉన్నారని గత ప్రభుత్వంలో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కొరకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని అదేవిధముగా మా గ్రామం పేరు గట్టుకాడిపల్లి అని రేషన్ కార్డులలో, ఆధార్కార్డులలో విద్యార్థులు చదువుకునే సర్టిఫికేట్లలో ఉన్నది. విద్యార్థులకు ప్రభుత్వ పథకాలకు అప్లై చేస్తున్నప్పుడు మాత్రం గ్రామం పేరు నర్సింగాపూర్ పేరు వస్తుందని అధికారులు మీ గ్రామం పేరు ఆన్లైన్లో లేదని రిజెక్టు చేస్తున్నారు. కావున అధికారులు మా గ్రామం పేరు గట్టుకాడిపల్లి ఉండే విధంగా ఆన్లైన్ మార్పిడి చేపియగలరని, గట్టుకాడిపల్లి ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు ఎన్నోసంవత్సరాల కోరిక మేరకు మాగ్రామాన్ని గ్రామపంచాయతీ గా చేసి ఆన్లైన్లో నర్సింగాపూర్ పేరు తీసివేసి గట్టుకాడిపల్లి అని పేరు ఆన్లైన్లో కూడా వచ్చే విధంగా చేయాలని గట్టుకాడిపల్లి గ్రామస్తులు పదుల సంఖ్యలో పాల్గొని ఎంపీడీవో కార్యాలయం ముందు ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని ప్లా కార్డులతో నిరసన వ్యక్తం చేసారు.