ఎమ్మెల్యే మురళి నాయక్ కు వినతి 

Petition to MLA Murali Naik– బైండ్ల కులాన్ని బి కేటగిరి నుండి ఏ కేటగిరి లో కి మార్చి మాకు న్యాయం చేయాలి
– బైండ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలకర యాలాద్రి 
నవతెలంగాణ – నెల్లికుదురు 
రాష్ట్రంలో బైండ్ల కులస్తులు బి కేటగిరి లో ఉన్నా వారిని తక్షణమే ఏ  కేటగిరీలోకి చేర్చినట్లయితే బైండ్ల కులస్తులకు న్యాయం చేకూరుతుందని  మహబూబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ కు వినతి పత్రాన్ని అందించినట్లు శనివారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలకర యాలాద్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బైండ్ల కులం గతంలో బీ కేటగిరీలో ఉండేది అట్టి దానిని ఏ కేటగిరీలోకి మార్చినట్లయితే ఎంతోమంది నిరుపేద బైండ్ల కులస్తులకు న్యాయం జరుగుతుందని కోరినట్లు తెలిపారు. బైండ్ల కులం చాలా తక్కువ మంది ఉన్నదని అన్నారు. బైండ్ల కులంలో నిరక్షరాస్యలు ఎక్కువ ఉండి  అక్షరాసులుగా తక్కువ ఉన్నారని అది నిరుపేద కుటుంబంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా బైండ్ల కులం అభివృద్ధి చెందాలంటే అసెంబ్లీలో మా సమస్యపై అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తే మాకు కొంత న్యాయం జరుగుతుందని అన్నారు. దీనికి మీ వంతు కృషి చేయాలని మహబూబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ను కోరినట్టు తెలిపారు.