తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం( తపస్) అచ్చంపేట డివిజన్ ఉపాధ్యాయ బృందం బుదవారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. నూతన సంవత్సర క్యాలెండర్ ను డైరీని అందజేశారు. ఉపాధ్యాయ సమస్యలైన సిపిఎస్ ను రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధణ బకాయిగా ఉన్న మూడు డీఏలను విడుదల చేసి, పిఆర్సినీ అమలు చేయాలన్నారు. పీఇటి పోస్టుల ఉన్నతీకరణ, 317 జీవో బాధితులకు న్యాయం, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తో ప్రమేయం లేకుండా ప్రమోషన్లు కల్పించలన్నారు. బదిలీల నిర్వహణ,పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించి స్వీపర్లు మరియు స్కావెంజర్ల నియామకం, పాఠశాలలకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమం పనులు అన్ని పాఠశాలలో పూర్తిస్థాయిలో నిర్వహించాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నతి కార్యక్రమాలపై సమీక్ష, వంట కార్మికులకు జీతాలు పెంచి, ప్రతినెల బిల్లులు సకాలంలో అందజేత మొదలగు అంశాలపై దాదాపు 40నిమిషాలు చర్చించి, వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. పై సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేటందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు కొంగర శ్రీనివాసులు, పెంట్యా నాయక్, జిల్లా నాయకులు జగదీశ్వర్, అరవిందరావు, రమేష్ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సభ్యులు రమేష్ రాథోడ్, సతీష్ కుమార్, గోవర్ధన్, నాచ, కమలేకర్ నాగేశ్వర్ రావు, ఆంజనేయులు, రాజేష్ రాంగోపాల్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, శివప్రసాద్, తిరుపతయ్య, రవీందర్ రెడ్డి, లింగస్వామి, ఉత్తర కుమార్, లాలు, మహేష్, శివ, రామారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.