పంచాయతీ కార్యదర్శిని తొలగించాలని వినతి

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట ఎంపీడీవో కార్యాలయం శనివారం, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి కవిత విధులు సరిగా నిర్వర్తించడం లేదు అని, సమయానికి కార్యాలయానికి రావడం లేదు అని, గ్రామస్తులు స్థానిక నాయకులతో మర్యాదపూర్వకంగా మాట్లాడడం లేదు అని, పనులను కాలయాపన చేస్తూ పెండింగ్ పెడుతుంది అని, అడిగితే బెదిరిస్తుంది, దురుసుగా ప్రవర్తిస్తుంది అని, పుట్టినరోజు, మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో జారీ చేయకపోవడం వల్ల, అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారని, కిందిస్థాయి సిబ్బందికి కూడా సరిగా పనులు విధులు చెప్పకపోవడం వల్ల అలసత్వంగా ఉన్నారని, గత 10 ఏళ్లుగా ఇక్కడే గ్రామంలో పనిచేయడం వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, ఈమెతో మాకు చాలా ఇబ్బంది ఉన్నందున వెంటనే ఇక్కడ నుంచి వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయగలరని, ఇక్కడ కొత్త వారిని నియమాకం చేయాలని యాదగిరిగుట్ట ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కళ్లెం విజయ జహంగీర్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ యాకూబ్, సుంచు వినోద్ తదితరులు పాల్గొన్నారు.