మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు గుత్ప, అలీ సాగర్ ఎత్తిపోతల కార్మికులు సమస్యలు తీర్చాలని ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ షబ్బీర్ కు వినతి పత్రాన్ని సీఐటీయూ అధ్వర్యంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు నాయకులు కొండ గంగాధర్ మాట్లాడుతూ గుత్ప, అలీ సాగర్ ఎత్తిపోతల ఇరిగేషన్ కార్మికులు పంపు వద్ద పనిచేసే కార్మికులు గత ఐదు నెలల నుండి కాంట్రాక్టు వేతనాలు ఇవ్వకుండా డబ్బులకు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయం జిల్లా అధికారులు తెలియజేసినాప్పటికిని పట్టించుకోవడం లేదని, అంతేకాదు బెదిరింపులు కూడా పాల్పడుతున్నారన్నారు. ఇందులో పంపు ఆపరేటర్స్, గార్డెన్స్, వాచ్మెన్సు, క్లీనర్స్ గత వారం రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నారని, కార్మికులకు పీఎఫ్ కట్టకుండా కనీస వేతనం కూడా ఇవ్వకుండా వేధింపులు గురి చేస్తున్నారన్నారు. కాబట్టి కాంట్రాక్టర్ తక్షణమే జీతాలు అమలు చేస్తూ, వేతనాలు విడుదల చేయాలని కోరారు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్షుడు, కార్మికులు పాల్గొన్నారు