
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ నెల 22 న సెలవు కోరుతూ..సుమారు 500 సంవత్సరాల నుండి భారత ప్రజలు ఎదురుచూస్తున్న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈనెల 22వ తేది సోమవారం రోజు ప్రతి ఇంటిలో మరియు అన్ని గ్రామాలలో పండుగ వాతావరణంతో సంబరాలు జరుపుకుంటున్న శుభ తరుణంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తపస్ ఉప్పునుంతల మండల శాఖ తరపున ఉప్పునుంతల మండల తహసిల్దార్ కి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు తెలియజేసి తన వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగర శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి జగదీశ్వర్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, రాజేష్ నాయకులు మల్లారెడ్డి, సురేందర్ గౌడ్, అనురాధ, కల్పన శ్రీలత, అనిత తదితరులు పాల్గొన్నారు.