అమెరికాలో తెలంగాణ ముఖ్యమంత్రికి వినతి..

Request to Telangana Chief Minister in America..– రావి నారాయణరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అమెరికా పర్యటనలో  ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి ని, రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ, అమెరికా విభాగం సబ్యులు రావి అనిల్ రెడ్డి, కాగిదాపురం ప్రదీప్ రెడ్డి, బందారం అనిల్  న్యూ జెర్సీలో కలిసి, రావి నారాయణరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఎన్నారై అమెరికా విభాగం తరఫున వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ 1952 సం.లో జరిగిన భారత దేశ మొట్ట మొదటి లోక్ సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద, జవహర్లాల్ నెహ్రూ కంటే కూడ అత్యధిక మెజారిటీ సాదించి, ప్రధమ పార్లమెంటును ఆరంభించి, ప్రారంబించిన బొల్లేపల్లి గ్రా, యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కీ.శే. రావి నారాయణ రెడ్డి  గురించి ప్రస్తావించినట్లు తెలిపారు.  రానారె సంస్థ, యన్.ఆర్.ఐ విభాగం తరపున ముఖ్యమంత్రి కి వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాదులో, భువనగిరిలో రానారె  నిలువెత్తు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని, ప్రాంతాలకు, నిర్మాణాలకు వారి నామకరణం చేయాలని, పరిశోధనా రంగంలో అవార్డు ఏర్పాటుకై, రాయగిరిలో తలపెట్టిన స్టేడియంకు రానారె నామకరణం చేయాలని వినతి పత్రంలో కోరారు. అందుకు ముఖ్యమంత్రి  సానుకూలంగా స్పందించారని తెలిపారు.