నవతెలంగాణ – హలియా
హాలియా మున్సిపాలిటీ ఛైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, వైస్ ఛైర్మన్ నల్గొండ సుధాకర్ లపై ఈరోజు హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు శనివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ని కలిసి అవిశ్వాసం తీర్మానం పెట్టాలని వినతిపత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారి లో మున్సిపాలిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి, 2వ వార్డ్ ఎడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి, మూడో వార్డు కౌన్సిలర్ అన్నేపాక శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ గౌని సుధా-రాజా రమేష్ యాదవ్,7వ వార్డు పిల్లి చంద్రకళ ఆంజనేయులు, 8వ వార్డు ప్రసాద్ నాయక్, 9వ వార్డు తక్కేళపల్లి ఎల్లమ్మ వారితోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు తక్కేలపల్లి సైదులు, తదితరులు పాల్గొన్నారు.