నవతెలంగాణ నాగార్జునసాగర్: తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019లోని సెక్షన్-37 ప్రకారం గత జనవరిలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ కర్ణ అనూష రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కొనసాగించాలని కోరుతూ నందికొండ మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ, మోహన్ రావు, మంగత నాయక్, రమేష్ జి, శిరీష మోహన్ నాయక్, ఆదాసు నాగ రాణి, నిమ్మల ఇందిరా గౌడ్, అన్నపూర్ణ తదితరులున్నారు.