భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ.. వలిగొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల సంక్షేమ వసతి గృహంలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్ట్ భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థుల పట్ల పర్యవేక్షణ లోపంగా వ్యవహరిస్తున్న ఎస్ ఓ ను సస్పెండ్ చేయాలని కోరారు. అదేవిధంగా హాస్టల్లో మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. హాస్టల్లో విద్యార్థులకు వాటర్ సదుపాయం, కరెంటు సౌకర్యం సరిగ్గా లేక, బాత్రూంలో డోర్లు సరిగా లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనారోగ్య పరిస్థితి ఎదురవుతే చెప్పడానికి వార్డెన్ లేక ఇబ్బందులు పడతా ఉంటే ఉన్న బాధ్యులు ఎస్ఓ పర్యవేక్షణ చేసి విద్యార్థుల బాగోగులు తెలుసుకోవాల్సిన వారు హాస్టల్ కి రాకుండా సమస్యలు తెలుసుకోకుండా తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరించడం జరుగుతుంది ఈ సరైన పద్ధతి కాదు వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.ఈసమస్యలన్నీ ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకపోగా కలెక్టర్ స్పందించి ఈ సమస్యలను త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు బుగ్గ ఉదయ్ కిరణ్, మండల నాయకులు వేములకొండ వంశీ, నరేందర్, పర్దీన్ తదితరులు పాల్గొన్నారు.