నవతెలంగాణ-మంచాల
అంగన్‌వడీలు, ఆశాకార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోనీ కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళ్లులర్పించారు. తమ సమస్యలు పరిష్కరించాలని గాంధీ చిత్రపటానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పోచమోనీ కృష్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు,మధ్యాహ్న భోజన కార్మికులు కొన్నేండ్లుగా చాలీచాలనీ వేతనాలతో దుర్బర జీవితం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసినా స్పందించకపోవడం విచారకరమన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు ఉన్నారు.