పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీలోకి తేవాలి

Petrol and diesel should be brought under GST– బీజేపీ యేతర రాష్ట్రాల విముఖత : మంత్రి హర్దీప్‌ సింగ్‌
న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ఇంధనాలను వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకురావాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ అన్నారు. అయితే అదనపు వ్యాట్‌ను వదులుకోవడానికి బిజెపియేతర రాష్ట్రాలు సుముఖంగా లేవని పేర్కొన్నారు. దీనిపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. పూణె ఇంటర్నేషనల్‌ సెంటర్‌ 14వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. పెట్రోలు, డీజిల్‌ జిఎస్‌టి పరిధిలోకి రావాలని తాను చాలా కాలంగా వాదిస్తున్నానని అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించడానికి భారత్‌ వ్యూహాత్మక నిల్వలపై దృష్టి సారిస్తుందన్నారు. దిగుమతి చేసుకున్న ఇంధనంపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించడానికి అన్వేషించాలన్నారు. రాష్ట్రాలకు వాస్తవానికి మద్యం, ఇంధనం ప్రధాన ఆదాయ వనరులుగా ఉండటంతో ఆ రెండింటిని జిఎస్‌టిలోకి చేర్చడానికి ఆనాసక్తిని చూపుతున్నాయన్నారు. జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశాల్లోనూ ఇది పలు సార్లు చర్చకు వచ్చిందన్నారు.