పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా

పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా– పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌.. పెద్దఎత్తున మంటలు
– మెట్‌పల్లిలో మంగళవారం తెల్లవారుజామున ఘటన
నవతెలంగాణ -మెట్‌పల్లి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పరిధిలోని వెంకట్రావ్‌పేట జాతీయ రహదారిపై ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా పడి, పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో నిజామాబాద్‌ నుంచి మెట్‌పల్లి వైపు వస్తున్న పెట్రోల్‌ ట్యాంకర్‌ వెంకట్రావుపేటలోని హెచ్‌పీ పెట్రోల్‌ పంపు మూలమలుపు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దాంతో మంటలు లేచాయి. పక్కనే ఉన్న స్క్రాప్‌ గోదాంకు మంటలు అంటుకుని అక్కడే ఉన్నా ట్రాన్స్‌ఫారమ్‌ పేలిపోవడంతో భారీ శబ్దం వచ్చింది. వెంటనే స్థానికులు ఫైర్‌ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించగా, ఫైర్‌ఇంజిన్‌తో వచ్చి సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎంతకీ మంటలు అదుపులోకి రాకపోవడంతో సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ చిరంజీవి జాతీయ రహదారిపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు.