మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి..

నవతెలంగాణ -ఆర్మూర్ 
 మున్సిపల్ కార్మికులకు పిఎఫ్,,ఈఎస్ఐ అమలు చేయాలని  బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షులు -దండి వెంకట్ అన్నారు.. పట్టణ మున్సిపల్ కార్మికులకు 8 నెలల పీఆర్పీ బకాయిలు ఇవ్వాలని, పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో గురువారం బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం  చేయడంలో  మున్సిపల్ అధికారులు తీవ్రమైన వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.కనీస వేతనం  26 వేల కోసం 28న ఛలో కలెక్టరే టు, కనీస. వేతనం 26 వేలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  28న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత మాట్లాడుతూ మున్సిపల్ మహిళా కార్మికుల శ్రమ దోపిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, స్థానిక నాయకులు రాజ్న, శ్రీనివాస్, పాండు, బాజన్న, బి.అశోక్, రాజ్యలక్ష్మి, నర్సయ్య, గంగాధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..