నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ పరీక్షలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి.ఎంబీఏ, ఎంసీఏ, ఆరవ సెమిస్టర్ ఐ ఎం బి ఏ పదవ సెమిస్టరు, ఎల్.ఎల్.బి, ఎల్ఎల్ఎం, ఒకటవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల,నిజామాబాద్, ప్రభుత్వ కళాశాల బోధన్ తెలంగాణ వర్సిటీ కళాశాల, తెలంగాణ వర్సిటీ న్యాయ కళాశాల సెంటర్ ల లో పరీక్షలు జరుగుచున్నాయి. ఈ పరీక్షలకు రాసే విద్యార్థుల సంఖ్య మొత్తం 574. కాగా 551 మంది విద్యార్థులు హాజరు కాగా 23 మంది విద్యార్థులు హాజరు కాలేదని పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్ ఒక ప్రకటన లో తెలిపారు.