తెలంగాణ యూనివర్సిటీ లోని న్యాయ కళాశాలలో సోమవారం నుండి ఎల్.ఎల్.బి. ఐదవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినాయి. ఈ పరీక్షలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ.యాదగిరి రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ పరీక్షలకు 28 మంది విద్యార్థులకు 26 మంది విద్యార్థులు హాజరయ్యారు. (02) ఇద్దరు విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.