– మాటమార్చిన కాంగ్రెస్
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి భాస్కర్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఫార్మాసిటీని కాంగ్రెస్ రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందిందని, ఇప్పుడు దానిపై మాట మార్చారని, వెంటనే ఫార్మాసిటీని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. కాంగ్రెస్ మాటలు నమ్మే ప్రజలు బీఆర్‌ఎస్‌ని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, అధికారం లోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా సిటీని ఎత్తివేస్తామని చెప్పి నెల తిరగకుండానే మాట మార్చారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫార్మాసిటీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ భూముల సేకరణ నిబంధనలను తుంగలో తొక్కి భూముల సేకరణ జరిగిందని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఫా ర్మా పరిధి భూముల్లో పరిశీలన పంపటం ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఫార్మా భూముల సేకరణకు వ్యతిరేకంగా, రద్దు చేయిస్తామని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాల్సి న బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల ముందు ఒకమాట.. గెలిచిన తరువాత ఒక మాట చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. ఫార్మాసిటీని రద్దు చేయకపోతే పెద్ద యెత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.