ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలి

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం
నవతెలంగాణ-చండూరు
గట్టుప్పల మండలంలో ఫార్మా కంపెని నిర్మాణాన్ని తక్షణమే ఆపుదల చేయాలని సీపీఐ(ఎం) గట్టుపల మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం అన్నారు. బుధవారం గట్టుప్పల మండల కేంద్రంలో గట్టుపల టౌన్‌ శాఖ సమావేశం ఎండీ.రబ్బాని అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీ వలన కాలుష్యం బారినపడి ప్రజలు అనారోగ్య పాలవుతారన్నారు. ఇక్కడ సాగు భూములకు ఈ కాలుష్యం వల్ల తీవ్ర నష్టం ఏర్పడుతుందని, ఈ ఫార్మా కంపెనీతో ఈ ప్రాంతానికి గాని, రాష్ట్రాన్ని గాని ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రజల బాగోగులను పర్యావరణాన్ని పరిరక్షించడానికి తక్షణమే గట్టుప్పలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీని తక్షణమే మూసివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాకు బదులు, ఇతర చేతివత్తుల కంపెనీలను ఏర్పాటు చేసి ఉద్యోగ వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) టౌన్‌ శాఖ కార్యదర్శి కర్నాటి సుధాకర్‌, కర్నాటి వెంకటేష్‌, పెద్దగాని నరసింహ, పసుపుల చెన్నయ్య, తిరందాసు బిక్షమయ్య, మొద్దు గాలయ్య, నల్లవెల్లి బిక్షం, వడ్డేపల్లి లక్ష్మయ్య, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.