ఫార్మాసిటీ భూ బాధితులకు ఊరట..!

– నష్ట పరిహరం పెంపుపై ప్రభుత్వం సమీక్ష
– రైతుల కోరిక మేరకు పునరావాసం కల్పనకు ప్రణాళికలు
– డ్రగ్స్‌ ఫార్మాకు విముక్తి
– ఐటీ కారిడార్‌గా మారనున్న మహేశ్వరం
– జపాన్‌ కంపెనీ కోసం 2 వేల ఎకరాల కేటాయింపునకు ప్రభుత్వం యత్నం
– లక్షలో ఉద్యోగ కల్పనకు అవకాశం
ఫార్మాసిటీ భూ బాధితులకు న్యాయం చేయాలన్న దోరణిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో భూ బాధితుల సమస్యలపై పరిశీలన చేస్తోంది. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 19500 భూమి సేకరించింది. ఇందులో 60 శాతం మందికి పరిహారం అందింది. అయితే ఈ ప్రాంత ప్రజలు ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానిక ప్రజల కోరిక మేరకు సాధ్యామైనంత వరకు డ్రగ్స్‌ ఫార్మాకు స్వస్తి చేప్పేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫార్మాసిటీకి సేకరించిన భూములను ఐటీ కపెంనీలు, వివిధ పరిశ్రమల కోసం ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. మహేశ్వరం నియోజకవర్గాన్ని ఐటీ కారిడర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ
అవకాశాలు రానున్నాయి. ఈ ప్రాంతం మరో పైనాన్షియల్‌ డిస్ట్రిక్‌గా మారనుంది.
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలోని రెండు మండలాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. మహేశ్వరం నియోజకవర్గం లోని కందుకూరు, ఇబ్రహీంపట్నంలో యాచారం మండలాల పరిధిలో భూములు సేకరించింది. భూసేకరణలో భాగంగా భూ బాధితులకు ఇచ్చిన పరిహారం అసైన్డ్‌ రైతులకు ఎకరాకు రూ.8లక్షలు, పట్టాదారులకు రూ. 16 లక్షల చొప్పున ఇచ్చారు. దీన్ని మెజార్టీ రైతులు వ్య తిరేకించారు. కొంత మంది రైతులు ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని తీసుకున్నారు. కొంత మంది ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.
భూ బాధితులకు ఊరట..
ఫార్మాసిటీ భూ బాధితుల సమస్యలపై సమ గ్రమైన విచారణ చేయాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు అంతర్గత సమాచారం ఇచ్చిన అధికార పార్టీ వర్గీయులు తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రణాళికలు ఉండాలని ప్రభుత్వం జిల్లా ఇన్‌చార్జి మంత్రికి సూచించన్నట్టు తెలుస్తోంది. ఇందుకు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడుతూ పునరావాసం కింద రైతులు ఏమీ కోరుకుంటున్నా రనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు. రైతుల కోరిక మేరకు పరిహారం అందించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రైతులకు ఊరట కలి గించే శుభావార్తను త్వరలో ప్రభుత్వం వెల్లడించ నున్నట్టు సమాచారం.
ఫార్మాకు చెక్‌ పెట్టే యోచనలో ప్రభుత్వం
స్థానికంగా ఈ ప్రాంతంలో ఫార్మా కంపె నీలకు అవకాశం ఇవ్వొద్దని వస్తుండటంతో ప్రభుత్వం ఫార్మాకు చెక్‌పెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రత్యామ్నా యంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.
2 వేల ఎకరాల్లో జపాన్‌ కంపెనీ..
త్వరలో రెండు వేల ఎకరాల్లో జపాన్‌ కంపెనీ రాబోతుందని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదగా ప్రారంభానికి ఏర్పాట్లు సైతం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఇక్కడ వేలాది మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.

ఐటీ కారిడార్‌గా మహేశ్వరం
మహేశ్వరంకు పెద్ద ఎత్తున ఐటీ కంపె నీలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మహేశ్వరంను మరో ఐటీకారిడార్‌గా తీ ర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు.. ఈ బాధ్యతలు పూర్తిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రికి అప్పగించినట్లు ప్ర భుత్వ వర్గాలు చెప్పాయి. మరో పైనాన్షియల్‌ డిస్ట్రిక్‌గా మహేశ్వరంను మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.