జీవన తాత్త్విక నిధి జాలాది పాట

Philosophical treasure of life Jaladi songఅది 1943 ప్రాంతం.. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా దేశంలో ఊరూవాడ ఉద్యమిస్తున్న కాలం… విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌హొ తీరంలో ఒక పదకొండేళ్ళ కుర్రాడు మాసిన బట్టలతో బాల భిక్షగాడిలాహొచిత్తుకాగితాలు ఏరుకుంటున్నట్లు నటిస్తూ, రహస్య సమాచారం సేకరించిహొఅజ్ఞాత వాసంలోని స్వాతంత్య్ర సమరయోధులకు చేరవేసేవాడు.హొహొ
వందేమాతరం అంటేనే ఒళ్ళంతాహొహూనం జేసి,హొ మహిళలు, పసిపిల్లలని చూడకుండా బ్రిటీష్‌ ఆర్మీ సాగించే హింసాకాండను చూసిన ఆ కుర్రాడి కళ్ళుహొ ప్రతీకారాగ్నితో ఎరుపెక్కాయి. అందుకే ఫుట్‌బాల్‌ జట్టులో చేరి బ్రిటీష్‌హొ సైనికులతో, వారి పిల్లలతో తలపడిహొఆగ్రహంతో ఆటలాడారు.హొఆటలో పుట్‌బాల్‌ను తన్నేహొ నెపంతోహొ తెల్ల సైనికుల గుండెలపై కసిదీరా కాలుతో తన్నేవారు. ఆ దెబ్బకుహొతెల్ల ఆటగాళ్ళుహొవిలవిలలాడుతుంటేహొఆ కుర్రాడు మాత్రం దేశాభిమానంతో మహానందభరితుడయ్యారు.
బ్రిటీష్‌ వారి ఆధిపత్యాన్ని నిరసిస్తూ టెలిఫోన్‌ తీగలు కత్తిరించి, వారి కార్యాలయాల్లో కీలక దస్త్రాలను దగ్ధంహొ చేసినందుకు చిన్న వయస్సులోనేహొఅతను జైలుశిక్ష అనుభవించారు. ఆహొ బాలదేశభక్తుడి పేరు జాలాది రాజారావు. ఉద్యమంలో కొరియర్‌ బారు నుండి కాలక్రమంలో కల్చరల్‌ వారియర్‌గా ఎదిగిన జాలాది ప్రస్థానం ఆదర్శనీయం
తెలుగు సినిమా పాటకు జీవన తాత్త్వికను అద్దినహొ అమేయ గేయకవి జాలాది. విలక్షణమైనహొజానపదహొ బాణీలతో, అపూర్వమైన పల్లె నుడికారంతో హదయాన్ని కుదిపి వేసే సజీవస్ఫూర్తితో, ప్రభావ శీలమైన పాటలుహొ రాసి, వెండి తెరపై నవీన సజన కాంతినిహొప్రసరించినహొకవి ఆయన. గోరంత పదాలతో కొండంత భావాలను పండించే అసాధారణ కవన నైపుణ్యం జాలాదికి మాత్రమే తెలుసు.హొ”సూరట్టుకు జారతాది సితుక్కు సితుక్కు వాన చినుకు” అంటూహొతొలిపాటతోనేహొఅఖిలాంధ్రహొసినీ ప్రేక్షకులహొ మనసు గెలుచుకొని,హొతల పండినహొ చలన చిత్రహొ పండితులను ఆశ్చర్య చకితులను గావించారు జాలాది.
‘కాలంతో రాజీపడు కవిత్వం కాదు నాది/ అక్షరాన్ని అస్త్రంగా సంధించే కలం నాది’ అని ప్రకటించి, తుది శ్వాస విడిచే వరకు ఈ విధంగానే రచనలు చేసి తన మాటకు కట్టుబడిన పాటల బాటసారి జాలాది. ‘పుణ్య భూమి నాదేశం నమో నమామి/ ధన్య భూమి నాదేశం సదా స్మరామి’ అని దేశంహొకోసం అసువులు బాసిన వీరుల త్యాగాలను అనురాగంతో గానం చేసినా, ‘ఈ కాలం పది కాలాలు బ్రతకాలని/ ఆ బ్రతుకు లో నీవూ నేను మిగలాలని’ అని ప్రేమైక దష్టితో ఆకాంక్షించినా, ‘అభినవ శశిరేఖవో/ ప్రియతమా శుభలేఖవో’ అని భావగీతం రాసినాహొ’ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా’ అని జానపదుల రాగార్తిని పలికించినాహొ స్వతంత్ర వ్యక్తీకరణతో జాలాది తెలుగు పాటకు జవజీవాలను సమకూర్చారు. సినీ వేమనలా జాలాది తన ‘పాట వెలది’తో అబాల గోపాలాన్ని మంత్ర ముగ్ధులను చేశారు.
అనవరతమైన జీవనచైతన్యాన్ని పాటల్లో అద్భుతంగా పలికించిన జాలాది, 1932హొఆగష్టు 9హొకష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని దొండపాడు గ్రామంలో అమతమ్మ, ఇమ్మానియోల్‌ దంపతులకు జన్మించాడు. తండ్రి స్వాతంత్ర సమరయోధుడు.హొకష్ణాజిల్లా తొలి శాసనమండలి సభ్యుడు. అంటరాని మాల కుటుంబంలో పుట్టడం కారణంగాహొ సహజంగానే అనేక వివక్షలు ఆయనను చుట్టుముట్టాయి.హొ తెల్లదొరల రాజకీయ ఆధిపత్యం,హొనల్లదొరల కులాధిపత్యం నడుమ జాలాది బాల్యం నలిగిపోయింది. పాఠశాలకి బయట ఇసుకలో అక్షరాలు దిద్దుకొని విద్య నేర్చుకున్నాడు. దొండపాడులో ప్రాథమికవిద్య, గుడివాడ బోర్డు హైస్కూల్లో యస్‌.యస్‌.యల్సీ పూర్తి చేశాడు.హొతొలుత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై, కొంతకాలం జిల్లా రాజకీయాలవైపు దష్టి సారించి, అక్కడ ఇమడలేక శ్రీకాకుళం ప్రాంతంలో డ్రాయింగ్‌టీచర్‌గా ఉద్యోగం చేశాడు. అక్కడ పరిస్థితులను తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి, మళ్ళీ స్వగ్రామం వచ్చాడు.హొఆరోగ్యశాఖలో ఉద్యోగి అయిన భార్య ఆగేషమ్మ, ఇతర మిత్రుల ప్రోత్సాహంతో సినిమా రచయితగా రాణించాలని మద్రాస్‌ మహా నగరానికి చేరుకొన్నాడు. మోదుకూరి జాన్సన్‌, పి.సి.రెడ్డి ల ఆదరణతో సినీరంగ ప్రవేశంచేసి మూడున్నర దశాబ్దాలపాటు పాటల రచయితగా ప్రజల నీరాజనాలు అందుకున్నాడు. రెండు వందల చిత్రాల్లో పదిహేను వందల పాటలు రాశాడు. సినీ రంగంలోహొస్థిరంగా నిలబడటానికి అవసరమైన లౌక్యం లేకపోవడం వల్ల, ఉన్నదున్నట్లు మాట్లాడే నైజంవల్ల, ఆత్మ గౌరవాన్ని చంపుకొని దర్శక, నిర్మాతల చుట్టూ విధేయంగా ప్రదక్షిణాలు చేసే వీరభక్తి బొత్తిగా లేకపోవడం కారణంగా జాలాది ఎన్నో అవకాశాలను జారవిడుచుకున్నాడు. ”న రత్న మన్విష్యతిహొమగ్యతే హి తత్‌” అని కాళిదాసు అన్నట్లు రత్నం ఎవరికోసం వెతకదు, రత్నాన్ని మనం వెతుక్కుంటాం అన్నట్లుగా జాలాది జీవించాడు.
ఎనిమిదో తరగతి నుండే జాలాది కవితలు, పాటలు రాస్తూహొగురువులహొప్రశంసలందుకున్నాడు. సామాజిక దురన్యాయాన్నిహొప్రశ్నించినహొవేమన పద్యాలు, నీతి చంద్రికలోని నైతికత, ఈ కథల్లోని పదప్రయోగ దక్షత చిన్న వయస్సులోనే జాలాదిని ఆకర్షించాయి. ప్రారంభదశలోహొ నాటకాలు రాసి,హొ స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించిన జాలాది ఎన్నో బహుమతులు కైవసం చేసుకున్నాడు. సినిమా కవిగా తెరంగేట్రం చేయకముందే కవిగా, రచయితగా జాలాది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 1951 సంవత్సరం నుండి తెలుగు స్వతంత్ర, యువజన, తదితర పత్రికల్లో జాలాది కవితలు ప్రచురణమై, పాఠక జనాదరణ పొందాయి. త్రిపురనేని మధుసూదనరావు ప్రేరణతో ‘మధు’ ‘రాజా,’ ‘జా.రా’ వంటి కలం పేర్లతో జాలాది అనేక రచనలు చేశాడు.హొ
”భూమి నా భామిని/ కాలం నా కాలి చెప్పు/ కాదంటే ఈ గమనమే తప్పు” అంటూ జాలాది నూనూగు మీసాల వయసులో ధిక్కార కవిత్వం రాశాడు. ‘నేను ఆదిని/ నాడు జాబాలిని/ నేడు జాలాదినని’హొఅంటూ తాత్త్వికచైతన్యంతో చాటిచెప్పాడు
జాలాది తత్త్వ కవి. కథకు ఆత్మ లాంటి సినిమాను మలుపు తిప్పే పాట అవసరమైనప్పుడు ‘జాలాదింటికి దారేది’ అని దర్శక, నిర్మాతలు ఆయన కోసం వెతికిన సందర్భాలు లేకపోలేదు. జాలాది కలంనుండి జాలువారిన ఎన్నో పాటలు ఈనాటికీ జనం గుండె గొంతుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. టాలీవుడ్‌ కీర్తి కిరీటంలో కలికి తురాయిలా భాసిల్లుతున్నాయి. ఆ పాటలు నెమరువేసుకుంటే ఈ ఉరుకుల పరుగుల తరుణంలో మనసుకు గొప్ప ఉపశమనం కలుగుతుంది.
‘ఏతమేసి తొడినా ఏరు యెండదు/ పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు'(ప్రాణం ఖరీదు), ‘గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది/ ఏదారి వచ్చావురా/ జీవ! ఏ దారి పోయ్యావురా’ (కుంతీ పుత్రుడు) లాంటి ఎన్నో పాటలు తెలుగు తత్త్వ కవిత్వానికి కొత్త ఉత్తేజాన్ని అందించాయి. ‘బండెల్లి పోతుందే చెల్లెల/ బతుకు బండెల్లి పోతుందే చెల్లెల’ అనే పాటలో బతుకుకు రైలు బండికి మధ్య మనోహరమైన భావ సామ్యాన్ని ప్రబోధించాడు. ‘ఇదా ప్రపంచం’ సినిమాలో రైలు బండిలో భిక్షగాళ్ళు పాడు కొనే ఈ పాట ప్రగాఢమైన జాలాది భావనాశక్తికి ప్రబల తార్కాణంగా నిలుస్తుంది. ‘పదుగురితో పరుగెత్తే పయనము/ కడకు నలుగురితో నడిచెల్లే దూరము/ జెండాలు రెండేనే చెల్లెలా! అవి చావుపుట్టుకలంట చెల్లలా!/ సిగలిచ్చే వాడు దేవుడు, బండి దిగెల్లి పోయోడు జీవుడు’ అంటూ జీవన ప్రస్థానానికి తిరుగులేని భాష్యం చెప్పాడు.
జాలాది పాటల్లోని పల్లవులు, చరణాలు క్లుప్తసుందరంగా, తాత్త్విక బంధురంగా ఉంటాయి. లోతైన ఆలోచనలను రేకెత్తిస్తాయి. దూది పింజల్లాంటి పదాలతో పసిడి కొండల్లాంటి భావాలను పండించడంలో జాలాది సిద్ధహస్తుడు. జాలాది కవనం, పరిమాణంలో విత్తనంలా కనిపించి ప్రభావంలో మహావక్ష స్ఫూర్తిని కలిగిస్తుంది.
»poet is the food for tenderest stomachs. the poet is indeed the right papular philosopher అని ఫిలిప్‌ సిడ్నీ అన్నట్లుగా జాలాది ఒక తత్త్వవేత్తలా ప్రజావళికి పసందైన పాటల విందు చేశాడు.
‘చేతి చిటికెనేళ్లు కలసి కళ్యాణమై/ కాలి బొటిన వేళ్ళు కలసి నిర్యాణమై/ నాలుగు దిక్కుల ఉయ్యాల/ నలుగురు కలిసి మొయ్యాల/ కళ్ళుతెరుసుకుంటే ఉయ్యాల /కళ్ళు మూసుకుంటే మొయ్యాల’ (ఎర్రమందారం)
‘నడక సాగితే రాదారి పడవలాగితే గోదారి’/ ‘చేసేది పట్టణ వాసం మెసేది పల్లెల గ్రాసం’/ ‘కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా ఆకలేసి అరిచినోళ్ళు కాకులంటరా/ ‘సూర్యుడు చేసిన పాపలన్నీశూద్రుడిగా పుడుతుంటే/ న్యాయం ధర్మం కర్మం ఒడిలో కర్ణుడిగా పడి చస్తుంటే’/ ‘అందరూనడిసొచ్చే త్రోవ ఒక్కటే/ చీమునెత్తురులు పారే తూము ఒక్కటే’
ఈ విధమైన అనంత చింతనతో, పరివర్తనానుభూతితో జాలాది పాటలు ప్రతిక్షణం వెంటాడతాయి. మనోమాలిన్యాన్ని సంపూర్ణంగా శుద్దిచేసి, మానవాళి ఎరుకను సమగ్రం చేస్తాయి. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న మాటకు ఈ కవి పాటలు అక్షర దర్పణంగా నిలుస్తాయి.
లోకంలో చూసింది, తెలిసింది ఉన్నదున్నట్లుగా ధైర్యంగా రాయలేని బలహీనత కొంతమంది కవుల్లో కనిపిస్తుందని, వాస్తవాన్ని కప్పిపెట్టే సజన నైజం ఏమాత్రం మంచిదికాదని జాలాది ఆరోపించాడు. ‘కార్బన్‌ పేపర్‌ చేసే కనీస ధర్మం కవి చేయగలిగితే సమాజం ఏనాడో బాగుపడేది” ఆయన ఆవేదన చెందాడు. సినిమా పాటలతో పాటు జాలాది ‘విశ్వమోహిని’, ‘కాకులమ్మ’ వంటి దీర్ఘ కావ్యాలు రాశాడని చాలామందికి తెలియదు. ఈ రెండు కావ్యాలు చదివితే జాలాది కవితా ప్రావీణ్యం తెలుస్తుంది. జాలాది సాహిత్యంపై ఆయన కుమార్తె డాక్టర్‌ జాలాది విజయ రచించిన ‘జాబాలి క్షేత్రంలో జాలాది అక్షరం’ అనే పరిశోధనా గ్రంథం చదివితే ఈ కవి వ్యక్తిత్వం మరింత బాగా అర్థమవుతుంది. తన తండ్రి పంచిన స్థిరాస్తులకు ఆశపడ కుండా, ఆయన అందించిన విలువైన సిరా ఆస్తులను విజయ లోకానికి చాటి చెబుతుంది.
సమాజంలో స్త్రీ నిర్వహించే మహోన్నత పాత్రను, త్యాగనిరతిని, పితస్వామ్య వ్యవస్థలో ఆమె ఎదుర్కొనే దుర్భర పరిస్థితులను జాలాది శక్తిమంతంగా పాటల్లో చిత్రించాడు. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలోని ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు/ పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు’ పాట ఇందుకు నిదర్శనం. ఈ పాటలో జాలాది పాడి ఆవుకు ఆడమనిషికి తులనాత్మకభాష్యం చెప్పిన తీరు అసాధారణం. ‘కుడితి నీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాది/ కడుపు కోత కోసినా అది మనిషికే జన్మనిత్తాది’ అన్న ఈ కవి సందేశం అమోఘం. ‘బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో/ గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో’ అని జాలాది పురుషోన్మాదులకు హితవు చెప్పాడు . సీసాకి మూత ఉంటుంది కానీ మనిషికి మాత్రం నీతి లేదేమిటని ప్రశ్నించాడు. ‘చీకటి కాటేస్తే లోకం రేతిరి అవుతుంది/ రేతిరి కాటేస్తే ఆడది చీకటి అవుతుంది’ అని దారుణమైన లైంగిక వివక్షను ఎత్తి చూపాడు
జానపదుల నిత్య వ్యవహారంలో అలవోకగా వ్యక్తమయ్యే కవితా విలువలతో, పలుకుబడులతో జాలాది తన పాటలకు పుటం పెట్టుకున్నాడు. రాయవలస, వీరఘట్టం వంటి ప్రాంతాల్లో ఉద్యోగం చేసే సందర్భంలో ఉత్తరాంధ్ర ప్రజల భాషా పరిమళాలను ఆస్వాదించాడు. సహజమైన గ్రామీణుల భాషాజ్ఞానాన్ని పరిశీలించాడు. ఏసీ భోగీల్లో ప్రయాణం చేసే అవకాశమున్నప్పటికీ పాసింజర్‌ రైల్లోనే ఆయన పరమ సంతోషంగా ప్రయాణం చేసేవాడు. ఆ కోలాహలంలో ఉట్టిపడే అసలుసిసలైన నుడికారాన్ని సమకూర్చుకొని పాటలు రాయడం వల్ల జాలాది పండితులకు, పామరులకూ అభిమాన పాత్రుడయ్యాడు. ‘రేతిరంత నిదుర కాసి కలువ పూలు నవ్వినట్లు/ రేపు మాపు ఆకాశం ఆకు వక్క ఏసినట్టు/ పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లి నట్టు/ తూరుపేపు తలుపు తీసి తొంగి చూసి నవ్వినట్టు’ ఇలాంటి జాలాది భావుకత ప్రాచీన కవుల వర్ణనలకు ఏమాత్రం తీసిపోదు. ఆ వర్ణనల కంటే భిన్నమైన దేశీయ శిల్ప సౌందర్యం ఈ కవి పాటల్లో దర్శనమిస్తుంది. ‘తడిసి పోయానా రేతిరి ఆడి జిమ్మడిపోను/ కుదిపి చుట్టేశాడమ్మ గాలి సచ్చినోడు’ అంటూ శంగారాన్ని కూడా ఈ కవి సూటిగా, సుతిమెత్తగా పల్లీయ కవితాశైలిలో తన పాటల్లో చిత్రించాడు. ‘ఓలమ్మ తిరనాల గిలక వగలాడి ఒయ్యారి మొలక’, ‘ఆమూడు ముళ్ళెయ్యరా నూరేళ్ళ పడకెయ్యారా’, ‘ఎన్నెల్లో ఇల్లెయ్యనా చుక్కల్లో పక్కెయ్యనా’ లాంటి రమణీయ వర్ణనలు, ‘గాలివానగాడు’, ‘రాతచేతగాని బెమ్మిగాడు’ వంటి ప్రయోగాలు, కన్నీళ్ళ ఉగ్గు, కష్టాల బువ్వ లాటి రూపకాలు పాటల్లో ప్రయోగించటం జాలాదికే సాధ్యం. శతక కవుల నైతిక దష్టి ఈ కవిలో స్పష్టంగా కనిపిస్తుంది. నిర్దిష్ట మాత్రాఛందోగతిలో, సహజ సిద్ధమైన ఆలంకారిక శైలిలో సాగే జాలాది పాట ఒక్కోసారి చండ్రనిప్పుల గండ్రగొడ్డలిలా గాండ్రిస్తుంది. మరొకమారు హదయ కాలుష్యాన్ని ప్రక్షాళన చేసే తాత్త్విక ఔషధంలా ప్రభాసిస్తుంది. జాలాది సాహిత్యం విస్తతంగా పాఠ్యప్రణాళికల్లో పొందుపరచాలి. ఒక ప్రభుత్వసంస్థకు ఆయన పేరుపెట్టాలి. సర్వకాలికమైన జాలాది రచనలను పునర్ముద్రించి అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తే ఈ తరానికి ఆయన సాహిత్య సంస్కారం అర్థమవుతుంది. తెలుగు సినీ వినీలాకాశంలో జాలాది ఒక అరుంధతి నక్షత్రం.
(ఆగస్టు 9 జాలాది జయంతి సందర్భంగా)
డా|| కోయి కోటేశ్వరరావు, 9440480274