– ఈ పండగ సీజన్ లో రూ 2000కు పైగా గ్యారంటీడ్* క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు అందుకోవచ్చు
నవతెలంగాణ హైదరాబాద్: ఈ దంతేరస్, దీపావళి పండుగలను పురస్కరించుకుని 24K డిజిటల్ గోల్డ్‌పైన ఉత్సాహపూరిత క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఫోన్‌పే ప్రకటించింది. ఫోన్‌పే నుండి యూజర్లు కనీసం INR 1500 విలువ చేసే బంగారం కొనుగోలుపై INR 2000 వరకు గ్యారంటీడ్ క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు. వన్-టైమ్ లావాదేవీలకోసం (ఒక యూజర్ కు ఒకసారి చెల్లుతుంది) 29 అక్టోబర్ నుండి 1 నవంబర్ 2024 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఫోన్‌పే తన యూజర్లకు తమ ఇంటినుండే డిజిటల్ గోల్డ్‌ను 24*7 వేళల్లో అందుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. వన్ టైమ్ కొనుగోలు మాత్రమే కాక ఫోన్‌పే SIP ద్వారా డిజిటల్ రూపంలో గోల్డ్ లో పెట్టుబడి పెట్టేలా ప్రతి భారతీయుడిని శక్తిమంతం చేస్తూ, తన కస్టమర్లకు ఒక క్రమ పద్ధతిలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడంలో కూడా కస్టమర్లకు సహాయం చేస్తోంది. కస్టమర్లు తమకు నచ్చిన రీతిలో ఎంత మొత్తంలో అయినా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా సేకరించుకున్న గోల్డ్ యూజర్ అకౌంట్ లో డిజిటల్ గా నిల్వ చేయబడి, సురక్షితమైన ఖజానాలో భౌతిక రూపంలో గోల్డ్ నిల్వ చేయబడుతుంది. ఏ సమయంలో అయినా గోల్డ్‌ను విక్రయించినప్పుడు యూజర్లు 48 గంటల్లో దానికి సంబంధించిన డబ్బును తమ అకౌంట్ లోకి క్రెడిట్ చేయించుకోవచ్చు.
యూజర్లు ఫోన్‌పే ప్లాట్ ఫారంలో 99.99% స్వచ్ఛమైనదిగా ధృవీకరించిన 24K డిజిటల్ గోల్డ్ ను MMTC-PAMP, సేఫ్ గోల్డ్, క్యారట్ లేన్ లాంటి డిజిటల్ గోల్డ్ రంగంలోని ప్రముఖ, విశ్వసనీయమైన సంస్థల నుండి కోనుగోలు చేసుకోవచ్చు. భారతదేశంలోని 19,000కు పైగా పోస్టల్ కోడ్లలో నివసిస్తున్న 1.2 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఎలాంటి తయారీ ఖర్చులు లేకుండా పారదర్శకమైన ధరలతో ఫోన్‌పే ప్లాట్ ఫారంలో అత్యంత స్వచ్ఛమైన 24K గోల్డ్‌ను కొనుగోలు చేశారు.
ఫోన్‌పేలో గోల్డ్ కొనే సమయంలో ఈ ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌ను అందుకునేందుకు దశలవారీ మార్గదర్శకం:
-
హోమ్ పేజీలోని కొనుగోళ్లు విభాగం కింద ఉన్న ‘గోల్డ్’పై క్లిక్ చేయండి.
-
‘వన్ టైమ్ కొనండి’ పై క్లిక్ చేయండి.
-
“Buy in Rupees/రూపాయలలో కొనండి”ని ఎంచుకోవడం ద్వారా ముందుకెళ్లి, కనీసం 1500 రూపాయల విలువ చేసే 24K గోల్డ్ చేర్చండి.
-
మీ గోల్డ్ కొనుగోలు తుది వివరాలను చెక్ చేసి, ‘Proceed to Pay/పే చేసేందుకు ముందుకెళ్లు’పై క్లిక్ చేస్తే చాలు. పని పూర్తయినట్టే.
*ఈ ఆఫర్ 29 అక్టోబర్ 2024, 00:00 గంటల నుండి 1 నవంబర్, 2024, 11:59 PM వరకు వన్-టైమ్ లావాదేవీలపై మాత్రమే లభిస్తుంది. SIP లావాదేవీలపై చెల్లదు. కనీస ఆర్డర్ విలువ రూ.1500. ఒక యూజర్ కు ఒకసారి మాత్రమే చెల్లుతుంది.