ఫోన్‌పే వనస్టాప్‌ పీఓఎస్‌ సొల్యూషన్‌

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక ఫోన్‌పే వ్యాపార భాగస్వాముల కోసం వన్‌స్టాప్‌ పీఓఎస్‌ సొల్యూషన్‌ను ప్రారంభించినట్టు తెలిపింది. దీంతో ఒకే పరికరంతో యూపీఐ, డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులను సమ్మతించడానికి అవకాశాన్ని కల్పిస్తోన్నట్ట వెల్లడించింది. ఈ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) పరికరం ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై తీసుకొచ్చినట్టు పేర్కొంది. దేశమంతటా దీన్ని విస్తరించాలని.. వచ్చే ఏడాది కల్లా 1.5 లక్షల పరికరాలను వ్యాపారులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఫోన్‌పే ఆఫ్‌లైన్‌ బిజినెస్‌ హెడ్‌ వివేక్‌ లోV్‌ాచెబ్‌ పేర్కొన్నారు.