– నాలెడ్జ్, నెట్వర్కింగ్ అవకాశాలతో SMEలను శక్తివంతం చేయడం కోసం కనెక్ట్ హైదరాబాద్ ఛాప్టర్ కృషి
– భారతదేశపు అతిగొప్ప రివార్డింగ్ అఫిలియేట్ ప్రోగ్రాంపై భాగస్వాములకు అవగాహన కల్పించిన కాన్ఫ్లూయెన్స్
నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫారం ఫోన్‌పే హైదరాబాద్‌లో కాన్ఫ్లూయెన్స్, కనెక్ట్ 2024 అనే రెండు ఫ్లాగ్షిప్ ఈవెంట్లను కలిపి తన పేమెంట్ గేట్‌వే సదస్సును విజయవంతంగా నిర్వహించింది. SMEలు, అవగాహన భాగస్వాములను శక్తివంతం చేసే దిశగా నిర్వహించిన ఈ అవగాహన, నెట్వర్కింగ్ సదస్సుకు ఈ రంగంలో అగ్రగాములుగా ఉన్న సంస్థలు, ఔత్సాహికులు, టెక్నాలజీ నిపుణులు హాజరయ్యారు. వెబ్ డెవలపర్లు, ఐటి సొల్యూషన్ స్ట్రాటజిస్టులు, ERP కన్సల్టంట్ల కోసం రూపొందించిన ఫోన్‌పే PG కాన్ఫ్లూయెన్స్ ఫోన్‌పే PG పార్టనర్ ప్రోగ్రాంలోని విశిష్ఠతలను అందించింది. ప్రొడక్ట్ ఆఫరింగ్స్, ఇందులోని రివార్డింగ్ అఫిలియేట్ ప్రోగ్రాంను నిర్మించుకుని, దీని ద్వారా ఎలా సంపాదించుకోవచ్చనే దాని గురించి నేర్చుకున్నారు. ఫోన్‌పే PG కనెక్ట్ 2024 ఇ-కామర్స్, D2C బ్రాండ్లపై దృష్టి సారించింది. ఇది వివిధ బిజినెస్ యజమానులు ఫోన్‌పే ప్రముఖులతో కలసి, అభిప్రాయాలు పంచుకుని, ఫోన్‌పే పేమెంట్ గేట్ వే గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశాలను కల్పించింది. ఈ ఈవెంట్‌కు హెరిటేజ్ ఫుడ్స్ సీఈవో శ్రీదీప్ కేశవన్ సహా 50 ఇ-కామర్స్, D2C బ్రాండ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే & ఆన్లైన్ మర్చంట్స్ విభాగం హెడ్ అంకిత్ గౌర్, “కాన్ఫ్లూయెన్స్, కనెక్ట్‌లను కలపడం ద్వారా, మేము వివిధ రంగాలను ఏకతాటిపైకి తెచ్చి, నాలెడ్జ్‌ను షేర్ చేసుకునేలా ఒక ప్రత్యేక ప్లాట్ ఫారంను క్రియేట్ చేశాము. ఈ ఫార్మట్ మా భాగస్వాములు, మర్చంట్ల అవసరాలను పరిష్కరించే అవకాశాన్ని మాకు అందేలా చేసింది. అదే సమయంలో మా ప్రొడక్టులు, సర్వీసులను మెరుగుపరిచేందుకు అవసరమైన విలువైన అంశాలను కూడా మేము పొందాము. నాణ్యమైన వనరులతో స్టార్టప్ పవర్ హౌస్‌గా వేగంగా అవతరిస్తున్న హైదరాబాద్ నగరంలో ఇంత ఉత్సాహంగా వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొనడం SMEలను శక్తివంతం చేసి, భారతదేశపు డిజిటల్ పురోగతి యానానికి అండగా నిలబడాలన్న మా చిత్తశుద్ధిని మరింత దృఢం చేస్తోంది” అని వ్యాఖ్యానించారు.
కనెక్ట్ సదస్సులో ప్రసంగించిన హెరిటేజ్ ఫుడ్స్ సీఇఓ శ్రీదీప్ కేశవన్ మాట్లాడుతూ, “వ్యాపార సంస్థలు విజయవంతం కావడానికి నేడు అనేక రకాలైన వనరులు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వ్యాపార సమస్యకు ఒక్కో ప్రత్యేకమైన పరిష్కారం అందుబాటులో ఉండవచ్చు కానీ తమ వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నేడు, చట్టబద్ధంగా కార్యకలాపాలు సాగించే వ్యాపార సంస్థలు చాలావరకు తమ కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం కోసం డేటాను విరివిగా ఉపయోగిస్తున్నాయి. వివిధ సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకునే క్రమంలో ప్రస్తుతం అవి పని చేస్తున్న తీరును అర్థం చేసుకుని, మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా తమను తాము సరి చేసుకోవడంలో కనెక్ట్లాంటి ఈవెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి.” అని అన్నారు. ఈ సదస్సు ఇప్పటికే 4,300 టెక్ స్టార్టప్ సంస్థలను కలిగిన హైదరాబాద్ నగరానికి భారతీయ స్టార్టప్ వాతావరణంలో పెరుగుతున్న ప్రాముఖ్యతను చాటి చెప్పింది. అంతేకాక, ఫోన్ పే వినూత్న పేమెంట్ సొల్యూషన్ల గురించి తెలుసుకోవడంతో పాటు ఇదే రంగంలోని సహ సంస్థల ప్రతినిధులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపార సంస్థలకు ఒక ప్లాట్ ఫారంను అందించింది.
ఫోన్‌పే గ్రూప్ గురించి పరిచయం: ఫోన్‌పే గ్రూప్ భారతదేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ. దీని ప్రధాన ఉత్పత్తి అయిన ఫోన్‌పే డిజిటల్ పేమెంట్ల యాప్‌ను ఆగస్ట్ 2016లో ఆవిష్కరించింది. కేవలం 7 సంవత్సరాలలోనే, 540+ మిలియన్ల రిజిస్టర్ చేసుకున్న యూజర్లు, ఈ యాప్‌ను ఉపయోగించి డిజిటల్ పేమెంట్లను స్వీకరిస్తున్న 39+ మిలియన్ మర్చంట్ల నెట్‌వర్క్‌తో భారతదేశపు ప్రముఖ యూజర్ పేమెంట్ల యాప్‌గా ఈ కంపెనీ అవతరించింది. ఫోన్‌పే 1.5+ ట్రిలియన్ డాలర్ల వార్షిక మొత్తం పేమెంట్ విలువ (TPV)తో కూడిన 260+ మిలియన్ల లావాదేవీలను ప్రతిరోజూ ప్రాసెస్ చేస్తుంది. డిజిటల్ పేమెంట్ల రంగంలో ఫోన్‌పే అగ్రగామిగా నిలిచిన నేపథ్యంలో, ఫోన్‌పే గ్రూప్ పైనాన్షియల్ సర్వీసులు (ఇన్సూరెన్స్, లెండింగ్, వెల్త్) అలాగే కొత్త కన్సూమర్ టెక్ బిజినెస్ (పిన్‌కోడ్ – హైపర్‌లోకల్ ఈ-కామర్స్, అలానే ఇండస్ యాప్‌స్టోర్ – భారతదేశపు మొట్టమొదటి లోకలైజ్ చేసిన యాప్‌స్టోర్)లను విస్తరించింది. ఫోన్‌పే గ్రూప్ అనేది భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని పనిచేసే టెక్ సంస్థ, ఇది ప్రతి భారతీయుడికి నగదు ప్రవాహాన్ని, సర్వీసులకు యాక్సెస్‌ను అనుమతించి, వారి పురోగతిని వేగవంతం చేయడానికి, అలానే వారికి సమాన అవకాశాలను అందించాలని కంపెనీ ఏర్పరచుకున్న లక్ష్యంతో అనుసంధానమైన బిజినెస్‌ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.