వాయిస్ ఫీచర్ కోసం మహేశ్ బాబును రంగంలో దించిన PhonePe

నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్‌స్టార్, నటుడు, మహేష్ బాబుతో కలిసి తన స్మార్ట్‌స్పీకర్లలో మొట్టమొదటిసారిగా సెలబ్రిటీ వాయిస్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు PhonePe నేడు ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ భారతదేశం నలుమూలలా తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ తెలంగాణ సినీ పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడుగా వెలుగొందుతున్న మహేష్ బాబు యొక్క విభిన్న స్వరంలో కస్టమర్ పేమెంట్లను ధృవీకరించడానికి PhonePe స్మార్ట్‌స్పీకర్లను అనుమతిస్తుంది. ఏడాది కిందట ప్రారంభించబడిన PhonePe స్మార్ట్‌స్పీకర్‌‌ను అప్పటి నుండి, దేశంలోని 90% పోస్టల్ కోడ్లలో ఉన్న మర్చంట్ భాగస్వాములు 4.8 మిలియన్లకు పైగా పరికరాలను ఉపయోగించారు. సగటున, PhonePe స్మార్ట్‌స్పీకర్లు తెలంగాణలో 10.9 కోట్ల నెలవారీ లావాదేవీలను చెల్లుబాటు చేస్తున్నాయి, ఇది రాష్ట్రంలో అది విస్తృతంగా వినియోగించబడుతున్న విషయాన్ని చాటి చెబుతోంది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధ సెలబ్రిటీ వాయిస్‌లను ఉపయోగించడం వల్ల కస్టమర్లకు, మర్చంట్లకు పేమెంట్ అనుభవం మరింత ఇంటరాక్టివ్‌గా చేయనుంది. ఈ కొత్త, విలక్షణమైన ఆఫర్‌పై PhonePe మర్చంట్ బిజినెస్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ యువరాజ్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ, “3.8+ కోట్ల మందికి పైగా మర్చంట్లతో కూడిన మా విస్తృతమైన నెట్‌వర్క్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉంది. పేమెంట్ ధృవీకరణ కోసం ఒక్కొక్క ప్రాంతం దాని ప్రత్యేక భాషా అవసరాలను కలిగి ఉంది. వివిధ ప్రఖ్యాత సెలిబ్రటీలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం ద్వారా, మేము మా మర్చంట్ల యొక్క అటువంటి విభిన్న అవసరాలను సృజనాత్మక మార్గంలో అందించడానికి మేము మా సేవలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాము. ఇది మర్చంట్లు, కస్టమర్ల మధ్య PhonePe స్మార్ట్‌స్పీకర్ ఆకర్షణను పెంచడంతోపాటు మా పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించేలా చూస్తుంది.” అని అన్నారు. తమ PhonePe బిజినెస్ యాప్ నుండి ఈ కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు మర్చంట్లు అవలంబించాల్సిన పద్ధతిపై దశల వారీ మార్గదర్శి కింద ఇవ్వబడింది. 1) PhonePe బిజినెస్ యాప్‌ను తెరవండి. 2) హోమ్ స్క్రీన్ లోని స్మార్ట్ స్పీకర్ విభాగానికి వెళ్లండి 3) ‘నా స్మార్ట్ స్పీకర్’ కింద , ‘స్మార్ట్ స్పీకర్ వాయిస్’పై క్లిక్ చేయండి. 4) నచ్చిన భాషలో కోరుకున్న సెలిబ్రిటీ వాయిస్‌ను ఎంచుకోండి. 5) వాయిస్‌ను యాక్టివేట్ చేసేందుకు ‘నిర్ధారించు’పై క్లిక్ చేయండి. 6) ఎంచుకున్న సెలిబ్రిటీ వాయిస్, అప్‌డేట్ చేసిన భాషతో కొన్ని గంటల్లోనే మీ పరికరం రీబూట్ అవుతుంది. PhonePe ఇటీవల తన స్మార్ట్‌స్పీకర్లలో సుప్రసిద్ధ భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ సహకారంతో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సెలిబ్రిటీ వాయిస్ ఫీచర్‌ను ప్రారంభించింది. భవిష్యత్తులో మరిన్ని భాషల్లో దీన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. పోర్టబిలిటీ, అత్యుత్తమ-శ్రేణి బ్యాటరీ, శబ్దాలతో నిండిన వాతావరణంలోనూ గొప్ప ఆడియో స్పష్టత, మర్చంట్లు దీన్ని ఉపయోగించడానికి అనుమతించే పొందికైన, బహుముఖ రూపం లాంటివి ఫీచర్లు PhonePe స్మార్ట్‌స్పీకర్లను మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇది అత్యంత రద్దీగా ఉండే కౌంటర్ ప్రదేశాలలో కూడా మర్చంట్లు వీటిని ఉపయోగించేందుకు అనుమతిస్తున్నాయి. గతంలో ఫీచర్ ఫోన్లను ఉపయోగించే మర్చంట్లు SMSపై ఎక్కువగా ఆధారపడేవారు. కానీ ఇప్పుడు PhonePe స్మార్ట్‌స్పీకర్ల రంగ ప్రవేశంతో వారి పేమెంట్ ధృవీకరణ అనుభవం మరింత సులభతరం చేయబడింది. PhonePe స్మార్ట్‌స్పీకర్లు 4 రోజుల వరకు నిలబడే బ్యాటరీ లైఫ్, ప్రత్యేకించిన డేటా కనెక్టివిటీ, సౌలభ్యం కోసం ప్రత్యేకతతో పని చేసే బ్యాటరీ లెవల్ LED ఇండికేటర్, బ్యాటరీ స్థాయి తగ్గినప్పుడు అందే ఆడియో అలర్ట్‌లు, అలాగే ప్రత్యేకంగా చివరి లావాదేవీకోసం పని చేసే రీప్లే బటన్‌తో పలు భారతీయ భాషల్లో వాయిస్ పేమెంట్ నోటిఫికేషన్లను అందిస్తున్నాయి. మర్చంట్లకు ఇలాంటి సౌలభ్యాన్ని అందించడం ద్వారా, మార్కెట్‌లో PhonePe స్మార్ట్‌స్పీకర్లను PhonePe విజయవంతంగా వినియోగంలోకి తీసుకువస్తోంది. తద్వారా డిజిటల్ పేమెంట్ల పెరుగుదలకు వీలు కల్పిస్తోంది. PhonePe గ్రూప్ పరిచయం: PhonePe భారతదేశపు అగ్రగామి ఫిన్‌టెక్ కంపెనీ. దాని ప్రధాన ఉత్పత్తి అయిన PhonePe డిజిటల్ పేమెంట్ల యాప్ 2016 ఆగస్టులో ప్రారంభించబడింది. కేవలం 7 సంవత్సరాలలో, కంపెనీ శరవేగంగా ఎదిగి, 51.5 కోట్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులతో, డిజిటల్ పేమెంట్లను అంగీకరించే నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న 3.8 కోట్లకు పైగా మర్చంట్లతో భారతదేశపు ప్రముఖ వినియోగదారు పేమెంట్ల యాప్‌గా ఎదిగింది. అంతేకాక PhonePe రోజూ 2.15 కోట్లకుపైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తూ, ఏడాదికి మొత్తంగా 1.4 ట్రిలియన్ డాలర్ల మేర పేమెంట్ విలువ కలిగిన లావాదేవీలను నిర్వహిస్తోంది. డిజిటల్ పేమెంట్లలో తనకు దక్కిన గొప్ప ఆదరణను అండగా చేసుకుని, PhonePe ఆర్థిక సేవల (ఇన్సూరెన్స్, లెండింగ్, సంపద) రంగంతో పాటు కొత్త వినియోగదారు టెక్ వ్యాపారాలలోకి (హైపర్ లోకల్ ఇ-కామర్స్ సంస్థ అయిన Pincode, భారతదేశపు మొదటి స్థానికీకరణ యాప్ స్టోర్-Indus AppStore) కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. PhonePe గ్రూప్ అనేది భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకున్న టెక్నాలజీ కంపెనీ. దీని వ్యాపారాల పోర్ట్ ఫోలియో ప్రతి భారతీయుడికి నగదు చలామణికి దారులు తెరచి, సేవలను అందుకునేలా చేయడం ద్వారా వారి పురోగతిని వేగవంతం చేసుకునే రీతిలో సమాన అవకాశాన్ని అందించాలనే కంపెనీ దార్శనికతకు అనుగుణంగా ముందుకు సాగుతోంది.