మర్చంట్ లెండింగ్ కోసం PhonePe కొత్త వేదిక ఆవిష్కరణ

–       మార్కెట్ ప్లేస్ తరహా నమూనాతో అన్ని బ్యాంకులు మరియు NBFCలకు తన విస్తృతమైన SME నెట్ వర్క్ లోని సంస్థలకు రుణాలు ఇచ్చే సౌలభ్యం

నవతెలంగాణ బెంగళూరు: తన మర్చంట్ లెండింగ్ వేదికను ఆవిష్కరించడం ద్వారా 35 మిలియన్లకు పైగా మర్చంట్లతో తనకున్న విస్తృతమైన మర్చంట్ పునాదికి పూర్తిగా డిజిటల్, నిరంతరాయ పద్ధతిలో బ్యాంకులు మరియు NBFCలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) రుణాలు ఇచ్చే వీలును కల్పించామని PhonePe ప్రకటించింది. ఇది చిన్న, మధ్య తరహా పరిశ్రమల (SMEs) కోసం ఆర్థిక సమ్మిళితత్వాన్ని ముందుకు నడపాలనే PhonePe నిబద్ధతతను పునరుద్ధాటించింది. భారతదేశంలోని SMEలు చాలా కాలంగా సంస్థాగతమైన రుణాలను అందుకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కున్నాయి. అది వాటి వృద్ధిని అడ్డుకోవడమే కాక, తమ సామర్థ్యాన్ని కూడా వెనక్కు లాగుతున్నాయి. ఇలాంటి  అందుబాటులో లేని అవసరాలను దృష్టిలో పెట్టుకుని, PhonePe తన బిజినెస్ యాప్ లో ఒక నిరంతరాయ రుణ వసతికోసం రూపకల్పన చేసింది. తద్వారా నిమిషాల్లో రుణాలు ఆమోదించేలా చర్యలు తీసుకుంది.  PhonePe ఒక శక్తివంతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ మరియు మెరుగైన సాంకేతిక సామర్థ్యాలను వినియోగించుకుంటుండగా, రుణ భాగస్వాములు ఒప్పందాలు ఏర్పరచుకోవడం, రుణ పంపిణీ మరియు వసూళ్లలో తమ నైపుణ్యాలను తీసుకువస్తాయి.
మే 2023 నుండి తన విశ్వసనీయమైన NBFC భాగస్వాముల ద్వారా 20,000 లోన్ల పంపిణీకు PhonePe విజయవంతంగా సౌకర్యం కల్పించింది. SMEల మధ్య క్రెడిట్ కోసం గొప్ప డిమాండ్ ఉన్న విషయాన్ని. ఆ అవసరాన్ని తీర్చేందుకు PhonePe యొక్క మార్కెట్ ప్లేస్ నమూనా ప్రభావశీలతను ఇదివరకెన్నడూ లేని విధంగా కంపెనీ ముందుగానే గుర్తించింది.  పేమెంట్ల వ్యాపారంలో మర్చంట్లతో తన శక్తివంతమైన ఒడంబడికలను కలిగి ఉండడం PhonePeను ప్రత్యేకంగా నిలుపుతోంది.  మర్చంట్ లావాదేవీల ప్రవర్తనను కంపెనీ లోతుగా అర్థం చేసుకుని ఉండడం మర్చంట్ వ్యాపారం యొక్క స్థితిని అంచనా వేసేందుకు దోహదపడింది. ఇంకా చెప్పాలంటే, అత్యాధునిక డేటా సైన్స్ చోదక నమూనాలను ఉపయోగించి, తన సొంత క్రెడిట్  స్కోర్ ను PhonePe చురుగ్గా అభివృద్ధి చేస్తుంది. ఇది భాగస్వామి యొక్క లెండింగ్ ప్రక్రియను ఎక్కువ సరళతరం చేస్తూ, మరింత సులభంగా క్రెడిట్ ను యాక్సెస్ చేసేందుకు వీలుగా SMEలకు శక్తినిస్తుంది. ఈ ఆవిష్కరణ గురించి సంస్థ ఆర్థిక సేవల విభాగం వైస్ ప్రెసిడెంట్ హేమంత్ గలా మాట్లాడుతూ, “ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడం అనేది PhonePe యొక్క కార్యాచరణ ప్రణాళికలో కీలకం. మార్కెట్ ప్లేస్ నమూనాను ఉపయోగించి, మన వేదికపై మర్చంట్ లెండింగ్ ను ఆవిష్కరించడం మాకు ఉత్సాహంగా ఉంది. SMEలు & MSMEలకు సంస్థాగత రుణాలను అందుబాటులోకి తెచ్చి, తద్వారా వాటి వృద్ధికి తోడ్పాటు అందించనున్నాము.  By serving as a catalyst for the financial empowerment of MSME & SMEల ఆర్థిక పటిష్ఠతకోసం ఒక ఉత్ప్రేరకంగా నిలవడం ద్వారా సంపూర్ణ ఆర్థిక వృద్ధికి, నిలకడైన పురోగతిని ముందుకు నడపడానికి దోహదపడడం PhonePe గర్వంగా భావిస్తోంది.’’ అని అన్నారు.