వ్యాపారి భాగస్వాముల కోసం వన్-స్టాప్ POS సొల్యూషన్‌ను PhonePe ప్రారంభించింది

– ఒకే పరికరంతో UPI, డెబిట్,  క్రెడిట్ కార్డ్ చెల్లింపులను యాక్సెప్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది~
నవతెలంగాణ- హైదరాబాద్: PhonePe, ఈరోజు తన పాయింట్-ఆఫ్-సేల్ (POS) పరికరాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇకపై వ్యాపారులు ఈ పరికరాన్ని ఉపయోగించి డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, UPI ద్వారా చెల్లింపులను యాక్సెప్ట్ చేసేందుకు వీలవుతుంది. వారికి సులభమైన, అవాంతరాలు లేని చెల్లింపు అనుభవాన్ని అందిస్తుంది. ఈ పరికరంలో PhonePe POS యాప్‌ ముందుగానే లోడ్ అయి ఉంటుంది. అలాగే ట్యాప్/స్వయిప్/డిప్ పద్ధతులతో పాటు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే డైనమిక్ QR కోడ్‌లతో చేసే లావాదేవీలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ POS పరికరం, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది. వ్యాపారాలు నిర్వహించే వారికి విప్లవాత్మక చెక్అవుట్ అనుభవాన్ని అందిస్తుంది. కస్టమర్లు కౌంటర్ వద్ద ఉన్నా, టేబుల్ వద్ద ఉన్నా, డెలివరీ లొకేషన్‌లో ఉన్నా లేదా సెల్యులార్ కవరేజీ ఉన్న ఎక్కడైనా సరే, చెల్లింపు ప్రక్రియను ఈ పరికరం సులభతరం చేస్తుంది. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. విశ్వసనీయత, భద్రత విషయంలో ఇది అగ్రశ్రేణిలో ఉంది. PCI-PTS 6 సర్టిఫికేషన్‌ను పొందింది. అటు వ్యాపారి డేటాకు, ఇటు కస్టమర్ డేటాకు భద్రత కల్పిస్తుంది. ఆటోమేటిక్ బ్యాచ్ క్లోజర్, యూనిఫైడ్(ఏకీకృత) సెటిల్‌మెంట్‌ సౌకర్యంతో వస్తున్న ఈ పరికరం, అవాంతరాలు లేని ఖాతా సెటిల్‌మెంట్‌కు వన్-స్టాప్ సొల్యూషన్ ప్రొవైడర్‌గా పని చేస్తుంది. వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. నామమాత్రపు నెలవారీ అద్దెను చెల్లించి దీన్ని పొందవచ్చు. PhonePe అందిస్తున్న ఈ పరికరం ప్రపంచ-స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూ సేవలు అందిస్తుంది. PhonePe POS పరికరంలో చక్కని టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు, వేగంగా ప్రతిస్పందించటం కోసం శక్తిమంతమైన ప్రాసెసర్, ఎక్కువసేపు పని చేసే బ్యాటరీ ఉన్నాయి. ఎప్పటికప్పుడు రసీదులను ప్రింట్ చేయడానికి వీలుగా లోపలే ప్రింటర్‌ను కూడా అమర్చారు. WiFiతోపాటు SIM కార్డ్ ద్వారా 4G కనెక్టివిటీని కూడా పొందవచ్చు. ఈ POS అనౌన్స్‌మెంట్‌పై ఫోన్‌పే ఆఫ్‌లైన్ బిజినెస్ హెడ్ వివేక్ లోహ్‌చెబ్ ఇలా వివరించారు “ఫోన్‌పే POS పరికరం అనేది మా వ్యాపార భాగస్వాములు తమ కస్టమర్‌ల కొనుగోలు అనుభవాన్ని మెరుగుపరచడానికి వీలు కల్పించే వన్-స్టాప్ సొల్యూషన్. ఇది ఏకీకృత(యూనిఫైడ్), వ్యవస్థీకృతమైన ఫీచర్లను కలిగి ఉన్న కారణంగా వివిధ చెల్లింపు పద్ధతులను సపోర్ట్ చేస్తుంది. సౌకర్యవంతంగా, సులభంగా దీన్ని ఉపయోగించవచ్చు. క్రెడిట్, డెబిట్ లావాదేవీలను యాక్సెప్ట్ చేసే సౌకర్యం కారణంగా, వ్యాపారులు తమ కస్టమర్ల సగటు టికెట్ సైజ్‌లో పెరుగుదలను ఆశించవచ్చు. అంతిమంగా ఇది వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది. PhonePeకి దేశ వ్యాప్తంగా 3.5 కోట్ల మంది వ్యాపారులతో విస్తారమైన నెట్‌వర్క్‌ ఉంది. మేము భారతదేశం అంతటా ఈ సొల్యూషన్‌ను విస్తరింపజేయాలని, వచ్చే ఏడాది కల్లా 1,50,000 పరికరాలను వ్యాపారులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని చెప్పారు.
PhonePe గురించి: డిసెంబర్ 2015లో PhonePe స్థాపితమైంది. అటు వినియోగదారులకు, ఇటు మర్చంట్‌లకు డిజిటల్ సదుపాయాలను అందించి తక్కువ సమయంలోనే భారతదేశపు అతిపెద్ద పేమెంట్ యాప్‌గా ఎదిగింది. 46+ కోట్ల (460+ మిలియన్ల) మంది యూజర్‌లు ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు PhonePeని వాడుతున్నారు. ఈ కంపెనీ, 3.5 కోట్ల (35+ మిలియన్ల) మంది ఆఫ్‌లైన్ మర్చంట్‌లను విజయవంతంగా డిజిటైజ్ చేసింది. వీరంతా టియర్ 2, 3, 4 ప్రాంతాలతో పాటు వాటి ఆవల కూడా ఉన్నారు. దేశంలో 99% పిన్‌కోడ్‌లను కవర్ చేస్తోంది. భారత్ బిల్ పే సిస్టమ్ (BBPS)లో కూడా PhonePe అగ్రగామిగా ఉంది. BBPS ప్లాట్‌ఫారమ్‌లో 45% లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. PhonePe 2017లో ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించింది. తన ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు సురక్షితంగా, వారి వీలును బట్టి పెట్టుబడి పెట్టే అవకాశాలను కల్పిస్తోంది. అప్పటి నుండి, కంపెనీ పలు రకాల మ్యూచువల్ ఫండ్స్‌ను, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇవి ప్రతి భారతీయుడికి, డబ్బు ప్రవాహాన్ని అన్‌లాక్ చేయడానికి, సేవలను పొందడంలో సమాన అవకాశాలను కల్పిస్తున్నాయి. ట్రస్ట్ రీసెర్చ్‌ అడ్వయిజరీ (TRA) ప్రకటించిన బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ప్రకారం, PhonePe వరుసగా రెండు సంవత్సరాల (2022 & 2023) పాటు డిజిటల్ పేమెంట్లలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా నిలిచింది.