వేములవాడ రూరల్ మండలంలోని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ బుధవారం నూతన కార్యవర్గంని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సందెల నరేష్, ఉపాధ్యక్షులు ఎండిఅజ్జు, ప్రధాన కార్యదర్శి మరిపెళ్లి అంజి, కోశాధికారి: సింగారపు ప్రశాంత్, గౌరవ అధ్యక్షులు బొమ్మెన శ్రీనివాస్ సలహాదారులు మంద రవి కార్యవర్గ సభ్యులు లక్కే సాగర్, జంకె ప్రభాకర్, చంద్రగిరి శేఖర్, పొత్తూరి సుధాకర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేయి పదాల్లో చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటోతో చెప్పొచ్చంటారు. అందుకే ఫోటోకు అంత ప్రాముఖ్యత ఉంటుంది అని అన్నారు. మన జీవితాల్లో జరిగే ఎన్నో ఘటనలను ఫోటోలుగా మలిచి.. వాటిని మధుర జ్ఞాపకాలుగా మార్చేవాడే ఫోటోగ్రాఫర్ అని వ్యాఖ్యనించారు. సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సందేల నరేష్ మాట్లాడుతూ సమస్యలు ఎన్ని ఎదురైనా అందరం ఐకమత్యంగా అసోసియేషన్ ని ముందుకు నడిపే విధంగా కృషి చేస్తానని అన్నారు. అలాగే విధి నిర్వహణలో సమస్యలు తలెత్తితే కార్యవర్గ సభ్యులకు తెలపాలని అసోసియేషన్ కోసం నిరంతరం కష్టించి పనిచేసి అభివృద్ధి పథంలో యూనియన్ ను నడిపేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. అందరినీ కలుపుకొని ఎన్నికైన సభ్యులందరం ముందుకు వెళ్తామన్నారు. నూతన కార్యవర్గానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. ఫోటోగ్రాఫర్ల యూనియన్ సభ్యులు తదితరులు ఉన్నారు.