నవతెలంగాణ – చండూరు
చండూరు మండలం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త ఆంజనేయులు గౌడ్ ప్రధాన కార్యదర్శి వర్కాల కిరణ్ కుమార్ ,కోశాధికారి తుమ్మల ఆంజనేయులు కుటుంబ భరోసా ఇంచార్జ్ నల్ల స్వామి గౌడ్ ఎన్నికైనందున, స్థానిక భారత్ చంద్ర గార్డెన్ లో జిల్లా అధ్యక్షుడు పసుపులేటి కృష్ణ, ప్రధాన కార్యదర్శి పుట్ట మోహన్ రెడ్డి హాజరై ఎన్నకయిన వారికి ప్రమాణస్వీకారం జరిపించి, నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్
తోకల చంద్రకళ వెంకన్న మాట్లాడుతూ…నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ శ్రేయస్సు కొరకు తమ వంతు తోడ్పాటు ఉంటుందని, సంఘం కోసం తన వంతుగా స్థల సేకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. చండూరు మండలం అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ల సంఘ శ్రేయస్ కొరకు తోడ్పాటు చేసుకుంటూ ముందంజలో నడపపి,మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ గౌరవ సలహాదారులు పున్న రామకృష్ణ , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముషం లక్ష్మణ్ నేత ,కుటుంబ భరోసా జిల్లా ఇంచార్జ్ నక్క జానయ్య, వైస్ కోశాధికారి గుమ్మడవెల్లి శ్రీను ,జిల్లా మీడియా చైర్మన్ అవురోజు మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు మొగుదాల వెంకటేశం,చండూర్ మండల సీనియర్ ఫోటోగ్రాఫర్లు నాగరాజు,గంగాధర్,అజంతా చారి,యాదయ్య,సతీష్, తదితరులు పాల్గొన్నారు.