ఫొటో, విడియోగ్రాఫర్లు టెక్నాలజీతో రాణించాలి: మాజీమంత్రి జగదీష్ రెడ్డి

Photo and videographers should excel with technology: Ex-minister Jagdish Reddyనవతెలంగాణ – సూర్యాపేట
మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటో,వీడియో గ్రాఫర్లు టెక్నాలజీ ని ఉపయోగించుకుంటూ తమ తమ రంగాల్లో రాణించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్లో కేబీఆర్ కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ,ఫోటో టెక్ సంయుక్తంగా నిర్వహించిన ఫోటో ట్రేడ్ ఎక్స్పోజింగ్ స్టాల్ ను ఆయన సందర్షించి మాట్లాడారు. ఇలాంటి ఎక్స్పో తెలంగాణ రాష్ట్రంలో జరగడం చాలా అద్భుతం అని కొనియాడారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు ఫోటో గ్రాఫర్లు ఇలాంటి ఎక్స్పోలో వినియోగించుకోవాలని కోరారు. స్టాల్స్ లో  మంచి కెమెరాలు, ఆల్బమ్స్ తో పాటు అన్ని రకాల కెమెరాలకు సంబంధించిన వస్తువులు ఒకే వేదికలో లభించడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల సంఘం, ఫొటో టెక్ సంయుక్తంగా ఫొటోట్రేడ్ ఎక్స్పో జింగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో వి 3 న్యూస్ చైర్మన్ కాశం సత్యనారాయణ గుప్తా , రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ,కోశాధికారి మునగాల శైలేందర్ ,వ్యవస్థాపక అధ్యక్షులు వెంక రెడ్డి ,సూర్యాపేట జిల్లా అధ్యక్షులకు కుట్ల లాలు, నల్గొండ జిల్లా  గౌరవ అధ్యక్షులు శ్రీమన్నారాయణ, జిల్లా అధ్యక్షులు  పసుపులేటి  కృష్ణ ,ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి ,ఫోటో టెక్ సీఈవో అభిమన్యు రెడ్డి ,భూపాల్ కుమార్, ఓం ప్రకాష్, జూలూరు మధు, ఫోటోగ్రాఫర్లు  పాల్గొన్నారు.