యాదాద్రి జిల్లా భువనగిరి లో ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివారం వేములవాడ రూరల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరిలో జరిగిన ఓ ఫంక్షన్ లో సెల్ ఫోన్ తో ఫోటోలు తీయాలని బంధువులు కోరగా ఫోటోగ్రాఫర్ ఫోన్లో ఫోటోలు తీయడం మా వృత్తి కాదని నిరాకరించడంతో బంధువులు ఫోటోగ్రాఫర్ పై దాడి చేశారని తెలిపారు. ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడం చాలా హేయమైన చర్య అని మండిపడ్డారు. దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫోటోగ్రాఫర్లపై ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మీడియా ముఖంగా హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ దానే వేణు, కోశాధికారి మహంకాళి బాబు, సభ్యులు వేణు, నాగరాజు, ప్రశాంత.ప్రభాకర్, శ్రీకాంత్, సందీప్, శ్రావణ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.