స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి ఆద్వర్యంలో ఫోటో గ్రాఫీ , విడియో గ్రాఫి, ఎలాక్రీషియన్ లకు గత 30 రోజుల శిక్షణ బుధవారం తో ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా చిఫ్ మెనెజర్, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం నిజామాబాద్ రవి పాల్గొని శిక్షణార్తులకు దృవీకరణ పత్రాలు, టూల్ కిట్ అందజేశారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలం లో ఫోటోగ్రఫీ చేసే వాళ్లకు చాలా మంచి డిమాండ్ ఉందని, పెళ్ళిళ్ళలో, ఇతర పండగలకు ఫోటోగ్రాఫర్లు చాలా ముఖ్యమని ప్రస్తుతం పెళ్ళిళ్ళలను ఒక సినిమాలాగా చిత్రీకరిస్తున్నారని వివరించారు.ఒక్క కార్యక్రమం నిర్వహిస్తే దానికి లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారని, ఈ శిక్షణా ద్వారా మీరు అందరూ జీవితంలో చక్కగా స్తిరపడవచ్చని సూచించారు. ఎస్బిఐ ద్వారా రుణాలు అందిస్తామని అన్నారు. అలాగే ఎలక్ట్రీషియన్ శిక్షణా కూడా చాలా డిమాండ్ లో ఉందని, కొత్తగా ఇల్లు కట్టుకునే వారు చాలా ఉన్నారని, అందరికీ ఎలక్ట్రీషియన్ లు దొరకడం ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. చక్కగా పని చేసి ఈ రంగంలో స్థిర పడలని సూచించారు. పని చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని కరెంట్ తో చాలా ప్రమాదాలు ఉంటాయని అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని పేర్కొన్నారు. బ్యాంక్ లో అకౌంట్ లేని వాళ్ళు ఎస్బిఐ లో జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో సంస్థ డైరక్టర్ సుంకం శ్రీనివాస్, ఆఫీసు సిబ్బంది బాగ్యాలాక్ష్మి, రామకృష్ణ, నవీన్, రంజిత్, గెస్ట్ ఫాకల్టీ లు పాల్గొన్నారు.