– అక్టోబర్ 15వ తేదీన ఢిల్లీలో అందజేత
నవతెలంగాణ-తాండూరు
మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డు-2023 సంవత్సరానికి తాండూరు పట్టణానికి చెందిన జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సం ఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ నల్ల రాధాకష్ణ అవార్డు ఆహ్వా నపత్రాన్ని సోమవారం హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. నల్లరాధా కృష్ణ మాట్లాడుతూ..ఎస్సీ, ఎసీ,్ట బీ సీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేయ నున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 30 ఏండ్లకు పైగా విద్యార్థి దశ నుండి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీల సంక్షేమం కోసం వారి అభివృద్ధి ఆకాంక్షించి నిరంత రం పోరాడుతూ ఎన్నో ఉద్యమాలను తీసుకుని అధికారు లను ప్రభుత్వాన్ని ఎదిరించి విద్యార్థుల కులవృత్తుల పక్షాన నిలబడి పోరాడుతున్న రాజ్‌కుమార్‌ను ప్రతిష్టాత్మమైన మ హాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డుకు సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందన్నారు. అక్టోబర్ 15వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా జ్యోతిబాపూలే జాతీయ అవార్డును రాజ్‌కుమార్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఆల్ ఇండియాలోనే 27 రాష్ట్రాల నుండి సుమారుగా 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ హాజరవుతారని తెలి పారు. ఈ అవార్డు ఆహ్వానపత్ర కార్యక్రమంలో బహుజన సాహితీ అకాడమీ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణతో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్, వికారాబాద్ జిల్లా అధ్య క్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.