ఫూలేకు భారతరత్న ఇవ్వాలి

– బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మన దేశానికి ఆత్మగౌరవ ఉద్యమాన్ని పరిచయం చేసి, మహిళలకు విద్యనందించాలని నినదించిన మహాత్మ జ్యోతిబా ఫూలే నేటి తరానికి ఆదర్శప్రాయుడని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్‌ తెలిపారు. ఆయనకు వెంటనే కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ సచివాలయం సమీపంలో అంబేద్కర్‌ విగ్రహం మాదిరిగా వంద అడుగుల ఫూలే విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీసీలను అణగదొక్కుతోందనీ, అందుకే కుల గణనను చేపట్టటం లేదని ఆయన విమర్శించారు.