
నవతెలంగాణ – కంటేశ్వర్
ఆధునిక భారత సామాజిక విప్లవ నిర్మాత మహాత్మా జోతిబా ఫూలే జీవిత చరిత్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో గల ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మొదటి సారిగా బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదలైన బహుజనులకు విద్య కోసం ఉద్యమించిన మహాత్మా జోతిబా ఆయన జీవిత భాగస్వామి సావిత్రమ్మ ఫూలే లు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని దండి వెంకట్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళ సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి, నాయకురాలు బి.చిన్ను బాయి, బిఎల్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రాజేందర్, నగర అధ్యక్షులు తిట్టే రాజు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు గంగాధర్ వాగ్మారే, సాయి కాంబ్లీ, కేశవ్ గాయక్వాడ్,బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమాన్, బిసి కులాల ఫెడరేషన్ జిల్లా నాయకులు జన్నేపల్లి సత్యనారాయణలు పాల్గొన్నారు.