
యోగా తోనే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోనాలు సాధ్యం అని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుమల గిరి సాగర్ మండలం లోని కొంపల్లి గ్రామం లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ భారతదేశంలో యోగాకు విశిష్టమైన స్థానం ఉందని అన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెబుతున్నారని తెలిపారు.యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు.