క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం

– కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ శరత్‌ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-దోమ
నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ శ్రీ శరత్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో పాలేపల్లి క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంటులో టాస్‌ వేసి మ్యాచ్‌ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ శరత్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే వారు గెలుపు ఓటములను సమానంగా చూడాలని సూచించారు.ఆరోగ్యంగా ఉంటే దేనినైనా సాధించవచ్చన్నారు. మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యాలను కాపాడుకునేందుకు క్రీడలు లేదా వాకింగ్‌, వ్యాయామం అలవరుచు కోవాలన్నారు. కార్యక్రమంలో చాపల గూడెం లక్ష్మణ్‌, గోవర్ధన్‌, మణికంఠ, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, అంజి, దస్తయ్య, ఫారూక్‌, నర్సింలు, దత్తు, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.