– మండల కేంద్రంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
నవతెలంగాణ – రాయపర్తి
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, క్రీడలతో శరీరక మానసిక ఉల్లాసం అందుతుందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పోటీలను ప్రారంభించారు. తదుపరి స్థానిక విద్యార్థులతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. పాఠశాలకు అవసరమైన పనుల గురించి తెలుసుకొని అతి త్వరలో విద్యార్థులకు కంప్యూటర్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోవాలని హితబోధ చేశారు. గ్రామీణ ప్రాంత యువత ప్రతిభకు మారుపేరుగా నిలుస్తుంటారని తెలిపారు. ఇలాంటి క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు బొమ్మెర కళ్యాణ్ గౌడ్, ఎనగందుల సంతోష్, శివరాజు, రాజశేఖర్, ఉమేష్, నగేష్, రాజు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, రెంటాల గోవర్ధన్ రెడ్డి, అఫ్రోజ్ ఖాన్, పెండ్లి మహేందర్ రేడ్డి, వల్లపు కుమార్, చిర్ర మల్లయ్య, మచ్చ నిల్లయ్య, పుల్లూరు దామోదర్ రెడ్డి, మచ్చ రమేష్ తదితరులు పాల్గొన్నారు.