
క్రీడలతో శారీరక దారుఢ్యం, మనో ఉల్లాసం కలు గుతుందని ఎంపీటీసీ వేల్పుల స్వామి ముదిరాజ్ అన్నారు శుక్రవారం ఎల్లారెడ్డిపేట గ్రామంలో 78 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా క్రీడల పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడుదారులకి వెళ్లకుండా విద్యపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఉన్నతమైన విద్యను అభ్యసించి తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. చెడు వేసనాలకు దూరంగా ఉండి ముందుకు సాగాలని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, క్రమశిక్షణ, పట్టుదలతో చదుకొని శిఖరాలను అదు రోహించా లని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నందారం వెంకటేష్ గౌడ్, నాయ కులు భీంరెడ్డీ ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.