
క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని ఎస్సై క్రాంతి కిరణ్ అన్నారు. చిట్యాల గ్రామంలో శ్రీ గోమాత మిత్ర మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి క్రికెట్ క్రీడా పోటీలను ఎస్సై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీల నిర్వహణ ద్వారా క్రీడాకారుల్లో ఒత్తిడి దూరమవుతుందని, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. క్రీడల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని, పోటీల్లో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రావుల వెంకట రంగారెడ్డి, గుంటుక వెంకన్న, రాపోలు సామ్రాట్ గుంటుక మహేష్, జనసేన మండల అధ్యక్షుడు దెశెట్టి వెంకట్, కోల రాము, ఆదిత్య, ఎండీ పాషా తదితరులు పాల్గొన్నారు.