క్రీడలతో శారీరక ధృడత్వం..మానసిక ఉల్లాసం

– ఎంపీపీ దాసరి ఎల్లూభాయిబాబు
నవతెలంగాణ-శామీర్‌పేట
క్రీడలు శారీరక ధఢత్వంతోపాటు మానసికొల్లా సానికి దోహదపడుతాయని ఎంపీపీ దాసరి ఎల్లూ భాయిబాబు అన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం షెడ్యూల్‌ కులాల అభివద్ధి శాఖ వసతి గహ విద్యార్థిని, విద్యార్థులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ హాజరయ్యారు. ఈ పోటీలలో బాల బాలిక లకు లాంగ్‌ జంప్‌, షాట్‌ఫుట్‌, రన్నింగ్‌ బాలికలకు నిర్వహించి ప్రతిభ కనబరచిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనితలాలి, సర్పంచ్‌ విలసాగరం బాలమణి, జిల్లా షెడ్యూల్‌ కులాలకు అతిధి అధికారి జి. వినోద్‌ కుమార్‌, జిల్లా యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ బలరాం, సహాయ ఎస్సీ అభివద్ధి అధికారి శేఖర్‌ రెడ్డి, పీడీ మురళీకష్ణ, పీఈటీలు సత్తిరెడ్డి, గోపాల్‌ చారి, రాధిక, శ్వేత, మేడ్చల్‌ జిల్లా షెడ్యూల్‌ కులాల వసతి గహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.