ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుల పట్ల చిన్నచూపు తగదు

– ఫిజికల్‌ సైన్స్‌ టీచర్ల ఫోరం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుల పట్ల పాఠశాల విద్యాశాఖ చిన్నచూపు చూడడం తగదని ఫిజికల్‌ సైన్స్‌ టీచర్ల ఫోరం తెలిపింది. ఈ మేరకు ఆ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు టి అజరుసింగ్‌, ప్రధాన కార్యదర్శి పి రాజశేఖర్‌, కోశాధికారి టి శ్రీనివాసాచారి, నాయకులు జగదీశ్‌, శ్రీకాంత్‌రెడ్డి, మధు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఆరు, ఏడో తరగతి గణితం సబ్జెక్టును బోధించాలంటూ ఇటీవల విద్యాశాఖ ఇచ్చిన 11143 మెమోను సవరించాలని డిమాండ్‌ చేశారు. తమకు బలవంతంగా బోధించాలని చెప్పడం సమంజసం కాదని తెలిపారు. ఈ విషయాలను సమగ్రంగా పరిశీలించి ఆ ఉత్తర్వులను సవరించాలని కోరారు.