హైదరాబాద్ : విదేశీ విద్యను అభ్యసించా లనుకునే విద్యార్థులకు సహాయపడేందుకు ఇటిఎస్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చు కున్నట్లు ఫిజిక్స్ వాలా (పిడబ్ల్యు) తెలిపింది. దీంతో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో చదువుకో వాలనుకునే విద్యార్థులకు సంపూర్ణ మార్గదర్శ కత్వం, మద్దతును అందించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. అమెరికాలోని ఇటిఎస్ అనుబంధ సంస్థతో ఒప్పందం విద్యార్థుల అవసరాలను తీర్చడానికి సరైన ఛానెల్ అని తాము భావిస్తున్నామని పిడబ్ల్యు అధికార ప్రతినిధి గౌరవ్ గులారియా పేర్కొన్నారు.