పూణె : కొత్త ఏడాది నుంచి తన ఆపే ఐస్-3 వీలర్ల ధరలను పెంచుతున్నట్టు పియాజియో తెలిపింది. జనవరి 1 నుంచి తన డీజిల్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ, పెట్రోల్ వేరియంట్‌లలోని కార్గో, ప్యాసింజర్ వాహన ధరలను సవరిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఎక్స్‌షోరూం ధరల్లో రూ.6,000 వరకు పెంపు ఉంటుందని వెల్లడించింది.