హైదరాబాద్: పికిల్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచులు గురువారం ఎల్బీ స్టేడియంలో ఆరంభమయ్యాయి. అమేచర్ తెలంగాణ పికిల్‌బాల్ సంఘం (ఏటీపీఏ) నిర్వహించిన ఈ పోటీలను ఏటీపీఏ అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి శాట్స్ వైస్ చైర్మెన్, ఎండీ డా. కె లక్ష్మి ప్రారంభించారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్) నిర్వహించే వేసవి శిక్షణ శిబిరంలో పికిల్‌బాల్‌ను సైతం చేర్చాలని ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు కోరారు.