నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల జీతాలపై ఆదాయపు పన్నును ప్రభుత్వమే చెల్లించేలా తెచ్చిన చట్టసవరణను రద్దు చేయాలనే పిల్‌పై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. జీతాలు, పెన్షన్, అనర్హతపై తొలగింపు చట్టం 1953లోని సెక్షన్ 3(4)ను రద్దు చేయాలని ఫోరంం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది. దీనిని చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించి ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.