పీలా రామకృష్ణ ప్రశంసా పత్రం స్వీకరణ 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
హైదరాబాద్ పీలా రామకృష్ణ మెమోరియల్ జీవ రక్షా సంఘం ప్రశంసా పత్రాన్ని తెలంగాణరాష్ట్ర ఫౌండర్, ప్రెసిడెంట్ సతీష్ ఖండేల్ వాల్ చేతుల మీదుగా అందుకున్నట్టు ఆళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన సంఘసంస్కర్త గుండెబోయిన రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జీవహింస చేయొద్దనేది ఈ సంఘం ముఖ్య ఉద్దేశం అని, “జంతు సంక్షేమమే – మన సంక్షేమం” అనే నినాదంతో ఈ సంఘం పని చేస్తుందన్నారు. అన్ని రకాల మాంసాహారాలను తినడం మానేసి పూర్తిగా శాకాహారిగా మారినందుకు గాను ఈ మెమోరియల్  ప్రశంసా పత్రాన్ని తనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.