– పొడుస్తూ పార్లమెంట్ భవనం ప్రారంభం
నవతెలంగాణ-భువనగిరి
ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తూ ప్రతిపక్షాల అభ్యంతరాన్ని భేఖాతర్ చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించడాన్ని నిరసిస్తూ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ మాట్లాడారు.నియంతృత్వ, నిరంకుశ విధానాలతో, పార్లమెంట్ విధానాలకు వేతిరేకంగా, ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా మనువాద బ్రాహ్మణ విధానానికి అనుకూలంగా మోడీ నూతన పార్లమెంట్ ప్రారంభించారన్నారు.దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని హిట్లర్ తుగ్లక్ పాలన గుర్తుకు చేసుకునే విధంగా ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.భారత పార్లమెంటరీ వ్యవస్థలో కీలకస్థానంలో ఉన్న రాష్ట్రపతి పదవిని కించపరుస్తూ అందులో ముఖ్యంగా ఒక్క గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రారంభోత్సవానికి పిలవకుండా వారిచేతనే ప్రారంభించకుండా అగౌరవపరచడాన్ని దేశంలోనే ప్రజాస్వామ్య వాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు.ఈ కార్యక్రమంలో దళిత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్,టీపీసీసీ డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవి, కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్, ఈరపాక నర్సింహ, సుజాత్‌అలీ కౌసర్, డాకూరి ప్రకాష్, చిన్న, యువజన కాంగ్రెస్ నాయకులు పుట్ట గిరీష్, ఎనగండ్లసుధాకర్, సాల్వేరు ఉపేందర్, సల్మాన్, సోమరవీందర్‌రెడ్డి, రవి, అల్లంపల్లి మహేష్, దర్గాయి దేవేందర్ పాల్గొన్నారు.