రాజ్యాంగాన్ని రక్షించుకుందాం: పిల్లి సుధాకర్

– మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
రాజ్యాంగాన్ని రక్షించుకుందామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ శనివారం అన్నారు. రాజ్యాంగం రక్షణ యాత్ర శనివారం  మండల కేంద్రానికి  చేరుకుంది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చే వారికి తగిన గుణపాఠం ఈ ఎన్నికల్లో చెప్పాలనీ, మాల మహానాడు రాష్ర్ట అద్యక్షుడు  పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ సంధర్బంగా మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శనివారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. కొందరు మనువాదులు రాజ్యాంగం స్థానంలో మను ధర్మ రాజ్యాంగాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ఈ ఎన్నికలలో వారికి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అద్యక్షుడు అనుపాల కిరణ్.రూరల్ అద్యక్షుడు జై గంగారాం అనుపల.మండల నాయకులు ములుగు భాస్కర్, మాణిక్యం, హిందే దిలీప్, బైండ్ల పెద్ద గంగారాం, బుయ్య గంగన్న, గన్న హరీష్, సోలమన్, తదితరులు పాల్గొన్నారు.