ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: పింగిలి శ్రీపాల్ రెడ్డి

Pingili Sripal Reddy will work to solve the problems of teachersనవతెలంగాణ – తుంగతుర్తి
త్వరలో జరగబోయే నల్లగొండఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పద్మశాలి భవన్ లో జిల్లా సంఘం అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో జిల్లానలు మూలాల నుండి విచ్చేసిన పి ఆర్ టి యు టి ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో మొదటి నుండి పి ఆర్ టి యు టి ఎస్ కు అవగాహన ఉందని అన్నారు. నేడు ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానంతో పాటు 317 జీవోతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయాలను పి ఆర్ టి యు టి ఎస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రంలోనే అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఏకం చేసి తమ హక్కుల సాధన కోసం తాను ముందుండి పోరాటం చేస్తానన్నారు. పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన పట్ల ఆయన రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నేడు ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించే బాధ్యత తాను తీసుకొని ముందుకు పోతారని అన్నారు.
సీపీఎస్ రద్దు,ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్, కేజీవీబీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్. త్రీ వన్ సెవెన్ జీవో రద్దు కోసం  పోరాడుతానన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై మొదటినుంచి పోరాడేది పి ఆర్ టి యు యూనియన్ అని, గత ప్రభుత్వంలో 30% పిఆర్సి సాధించేందుకు, ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 61 సంవత్సరాలు పెంచడం కేవలం పి ఆర్ టి యు చేసిన కృషి మూలంగానే సాధ్యమైందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం కోసం ప్రభుత్వంతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పి ఆర్ టి యు టి ఎస్ నిరంతరం పోరాటాలు చేస్తూ అనేక విజయాలు సాధించామన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో 22 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించిన చరిత్ర ఒక్క పిఆర్టియు టీఎస్ సంఘానికి దక్కిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఒత్తిడి పెంచుతుందన్నారు.  ఉపాధ్యాయులు సమస్యలతో పాటు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈఓ, డీఈవో, జూనియర్ లెక్చరర్స్,డైట్ లెక్చరర్స్ వంటి పోస్టులకు పదోన్నతి ద్వారా అవకాశాలు కల్పించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు బకాయి పడిన డిఏలు,వివిధ రకాల పెండింగ్ బిల్లుల పరిష్కార కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. ఉపాధ్యాయులందరూ సంఘటితంగా ఏర్పడి ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ యాదాద్రి జిల్లాల అధ్యక్షులు డి.వి. ఫణి కుమార్, కుంట్ల అమరేందర్ రెడ్డి,నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జాన్ రెడ్డి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్, జిల్లా శాఖ మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొలికొండ కోటయ్య,కృపాకర్ రెడ్డి,జ్యోతుల చంద్రశేఖర్, పప్పుల వీరబాబు,చింతరెడ్డి రామలింగారెడ్డి, ధర్మారపు వెంకటయ్య జిల్లా ఎన్నికల ఇన్చార్జిలు కందుకూరి శివశంకర్, సాదే లక్ష్మీనారాయణ తుంగతుర్తి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాటి సుధీర్ రెడ్డి, పోతరాజు చంద్రశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు గుజ్జ భాస్కర్ రాష్ట్ర, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.